China Fire Accident: ఈశాన్య చైనాలో ఘోర అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. చాంగ్‌చున్ సిటీలోని ఓ రెస్టారెంట్‌లో సంభవించిన అగ్ని ప్రమాదంలో 17 మంది కాలిబూడిదయ్యారు. అగ్నికీలల్లో చిక్కుకుని అందులోనే సజీవ దహనం అయ్యారు. అక్కడి స్థానిక ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం బుధవారం మధ్యాహ్నం 12.30 గంటల సమయంలో ఈ అగ్ని ప్రమాదం సంబవించింది. అగ్ని ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ దుర్ఘనటనలో 17 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అగ్నిమాపక సిబ్బంది అతి కష్టంమీద మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం లోపలికి వెళ్లి చూస్తే.. 17 మంది ప్రాణాలు కోల్పోయి కనిపించారు. వారి మృతదేహాలు కూడా గుర్తుపట్టడానికి వీల్లేకుండా  మంటల్లో పూర్తిగా కాలిపోయాయి. అతి కష్టంమీద మృతదేహాలను బయటికి తరలిస్తున్నారు. 


చైనాలోనే చాంగ్‌చున్ నగరానికి ఆటోమొబైల్ తయారీ పరిశ్రమల కేంద్రంగా పేరుంది. ఆటోమొబైల్ పరిశ్రమగా ఎదగడం వల్ల చాంగ్‌చున్‌కి వ్యాపారం నిమిత్తం, వాణిజ్య అవసరాలపై వచ్చిపోయే వారి సంఖ్య కూడా అధికంగానే ఉంటుంది. దీంతో రెస్టారెంట్‌లో జరిగిన ఈ అగ్ని ప్రమాదంలో చనిపోయిన వారిని గుర్తించడం కూడా ఇబ్బందికరంగానే మారిందని తెలుస్తోంది. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం అందాల్సి ఉంది.


Also Read : XI Jinping: జిన్‌పింగ్ గృహ నిర్బంధమంతా ఫేక్‌..ఆయన ఎక్కడ కనిపించారంటే..!


Also Read : Khosta-2 Virus: రష్యన్​ గబ్బిలాల్లో కొత్త వైరస్.. వ్యాక్సిన్లు కూడా పనిచేయవట..!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


Android Link https://bit.ly/3P3R74U


Apple Link - https://apple.co/3loQYe 


Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి