New Covid-like virus found in Russian bats: కొవిడ్ తరహాలో మనుషులకు సోకగల సరికొత్త వైరస్ ను రష్యన్ గబ్బిలాలలో గుర్తించారు పరిశోధకులు. ఈ వైరస్ పేరే 'ఖోస్టా-2' (Khosta-2 Virus). అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలేవీ ఈ వైరస్ ను ఎదుర్కోనే సామర్థ్యం లేదని యూస్ లోని వాషింగ్టన్ స్టేట్ యూనివర్శిటీ (WSU) పరిశోధకుల బృందం తేల్చింది. కరోనా వైరస్‌లోని సార్బేకొవైరసెస్ అనే ఉపజాతికి చెందిన సార్స్-కొవ్-2, ఖోస్టా-2.. ఒకే రకమైన స్పైక్ ప్రొటీన్‌ను ఆసరాగా చేసుకుని మానవ కణాలకు వ్యాపిస్తాయని వారి రీసెర్చ్ లో నిర్ధారణ అయింది.
ఖోస్టా-2 గురించి తెలుసుకోవాల్సిన విషయాలు:
1. ఖోస్టా-2 మరియు SARS- CoV-2 సార్బెకోవైరస్‌లు అని పిలవబడే కరోనా వైరస్ యొక్క ఉప-కేటగిరీకి చెందినవి.
2. ప్రస్తుతం ఉన్న కరోనా టీకాలు ఖోస్టా-2 వైరస్‌ను నిర్వీర్యం చేయలేకపోతున్నాయని వారు గుర్తించారు.
3. సార్బెకోవైరస్‌ల నుండి రక్షించడానికి సార్వత్రిక వ్యాక్సిన్‌లను అభివృద్ధి చేయవలసిన అవసరాన్ని అధ్యయనం హైలైట్ చేసింది.
4. ఖోస్టా-1 మరియు ఖోస్టా-2 వైరస్‌లు 2020 చివరిలో రష్యన్ గబ్బిలాలలో కనుగొనబడ్డాయి.
5. రెండూ మొదట్లో మానవులకు ముప్పుగా కనిపించలేదని పరిశోధకులు తెలిపారు.
6. ఖోస్టా-1 మానవులకు తక్కువ ప్రమాదాన్ని కలిగిస్తుందని.. అయితే ఖోస్టా-2 మాత్రం మనుషులపై తీవ్ర ప్రమాదాన్ని చూపిస్తుందని పరిశోధకులు తేల్చారు.
7. సార్స్-కొవ్-2తో ఖోస్టా-2 వైరస్ కలిసిపోతే మరింత ముప్పు ఏర్పడుతుందని వారు తెలిపారు.
Also Read: Italy New PM Meloni: ఇటలీ చరిత్రలోనే తొలిసారి.. దేశ ప్రధానిగా ఓ మహిళ..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook