China says Winter Olympics 2022 will proceed as planned despite Omicron challenge: కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ దెబ్బకు ఇప్పుడు ప్రపంచం మొత్తం భయపడుతోంది. ప్రపంచమంతా ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తమయ్యాయి. అయితే ఈ కొత్త వేరియంట్‌ (New variant‌) వల్ల వచ్చే ఏడాది ఫిబ్రవరిలో బీజింగ్‌ లో జరిగే వింటర్ ఒలింపిక్స్‌ నిర్వహణకు ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉందని చైనా పేర్కొంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ పోటీల నిర్వహణ క్రమంలో ఒమిక్రాన్‌ (Omicron) వల్ల కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశం ఉందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ పేర్కొంది. అయితే ఒమ్రికాన్‌ను చైనా ఎదుర్కోగలదని.. వింటర్ ఒలింపిక్స్ ( Winter Olympics) సజావుగానే సాగుతాయని తాము భావిస్తున్నట్లు చైనా (China) విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది.


Also Read : Sirivennela: చేంబోలు సీతారామశాస్త్రి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఎలా మారారు?


కోవిడ్‌ కొత్త వేరియంట్‌ ను ఎదుర్కొనేందుకు తమ వద్ద పలు మార్గాలున్నాయంటూ చైనా హెల్త్ అధికారులు పేర్కొన్నారు. ఒమిక్రాన్ విషయంలో చైనా ఇప్పటికే అన్ని రకాలుగా ముందు జాగ్రత్తలు తీసుకుంటుందని చైనాలోని సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్‌ పేర్కొంది. ఇక విదేశీ ప్రయాణాలపై ఇప్పటికే చైనా ఆంక్షలు విధించింది.అలాగే చైనాలో ప్రస్తుతం డెల్టా వేరియంట్ (Delta variant) కేసుల కాస్త ఎక్కువగా ఉండడంతో వాటి విషయంలో కూడా చైనా అప్రమత్తంగా వ్యవహరిస్తోంది.


Also Read : సిరివెన్నెలకు నచ్చిన ఆ రెండు పుస్తకాలు, కష్టమైన పాట ఏంటో తెలుసా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook