సిరివెన్నెలకు నచ్చిన ఆ రెండు పుస్తకాలు, కష్టమైన పాట ఏంటో తెలుసా

Sirivennela Twitter Interview: ప్రముఖ సినీ గేయ రచయిత, పాటల మాంత్రికుడు, పదాల సృష్టికర్త సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరనే వార్తను సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. అటు అభిమానులు తల్లడిల్లుతున్నారు. ట్విట్టర్ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటున్నారు.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 30, 2021, 06:09 PM IST
సిరివెన్నెలకు నచ్చిన ఆ రెండు పుస్తకాలు, కష్టమైన పాట ఏంటో తెలుసా

Sirivennela Twitter Interview: ప్రముఖ సినీ గేయ రచయిత, పాటల మాంత్రికుడు, పదాల సృష్టికర్త సిరివెన్నెల సీతారామశాస్త్రి ఇకలేరనే వార్తను సినీ పరిశ్రమ జీర్ణించుకోలేకపోతోంది. అటు అభిమానులు తల్లడిల్లుతున్నారు. ట్విట్టర్ సాక్షిగా ఆయన మాట్లాడిన మాటల్ని గుర్తు చేసుకుంటున్నారు.

తెలుగు సినీ పరిశ్రమను తీరని, అంతులేని శోకంలో ముంచేసి వెళ్లిపోయిన సిరివెన్నెల సీతారామశాస్త్రి(Sirivennela Sitaramasastri) అభిమానులతో చివరిసారిగా మాట్లాడింది గానీ భావాలు పంచుకున్నది గానీ ట్విట్టర్ వేదికపైనే. అలాగని ట్విట్టర్‌లో కూడా ఆయన ఈ మధ్యనే చేరారు. అంటే దాదాపు ఓ ఏడాది క్రితం. 2021 జూన్ నెలతో ఏడాది పూర్తి చేసుకున్న సిరివెన్నెల(Sirivennela)సీతారామశాస్త్రి..ట్విట్టర్‌లో అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు నిర్మొహమాటంగానూ..ఫన్నీగానూ సమాధానాలిచ్చారు. ఆ ప్రశ్నలు..సమాధానాలేంటో మీరే చదవండి.

మీకు బాగా నచ్చిన పుస్తకం ?

ఇష్టమైన పుస్తకాలు రెండే. ఒకటి భగవద్గీత, రెండవది ఖలీల్ జిబ్రాన్ రాసిన ద ప్రోఫెట్

తెలుగు భాష గొప్పతనం ఏంటి ?

ఏ బాష ప్రత్యేకత ఆ భాషదే. అసలు సమస్య ఏంటంటే మనుషులందరినీ కలపాల్సిన భాష..లుని తగిలించుకుని ఎందుకుందనేదే.

సిరివెన్నెల గారు పాటల రచయిత కాకపోయి ఉంటే ?

జరగాల్సిందే జరిగింది. జరగాల్సిందే జరుగుతుంది. 

గురువు గారూ..మా యూత్‌కి మీరిచ్చే సందేశమేంటి ?
యూత్ అనేది ఏజ్ కాదు. అదొక ఫేజ్. అదొక స్టేజ్. అది తెలుసుకుంటే Youth itself is a message

ప్రేమపాటలు అద్భుతంగా రాసే మీకు కావల్సిన ప్రేరణ, స్పూర్తి ఎవరి నుంచి కలుగుతుంది ?
బ్రతుకంతా ప్రేమే. ప్రేమ నుంచే ప్రేమ వస్తుంది.

యుగయుగాలుగా ఏ మృగాల కన్నా ఎక్కువ ఏం ఎదిగాం అంటారు. నిజమేనా?

తప్పే మృగాలను అవమానించకూడదు.

మీరు రాసిన పాటల్లో మిమ్మల్ని అత్యధికంగా శ్రమ పెట్టిన పాట ?
పాట వచ్చే క్రమంలో శ్రమ అనే మాటకు చోటు లేదు. 

దైవాన్ని నిర్వచించాలంటే

ముందు తనను తాను నిర్వచించుకోగలగాలి?

మెలకువగా ఉంటే  ఎక్కువగా ఏం చేస్తారు?

ఇప్పుడైతే ఎక్కువగా ఐపాడ్‌తో గేమ్స్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్నా

Also read: Sirivennela Songs: సిరివెన్నెల నేపధ్యమేంటి, రాసిన పాటలేంటి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News