Sirivennela: చేంబోలు సీతారామశాస్త్రి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఎలా మారారు?

Sirivennela Seethamarasastri: కళాతపస్వీ విశ్వనాథ్ తెరకెక్కించిన  'జననీ జన్మభూమి' అనే సినిమాలో సిరివెన్నెల సీతారామశాస్త్రి తన మొదటి పాట రాశారు. ఆ తర్వాత విశ్వనాథ్ తెరకెక్కించిన 'సిరివెన్నెల' సినిమాలో అన్ని పాటలు తానే రాశారు. ఆ పాటలు ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. ఆ సినిమాతోనే ఆయన పేరు కూడా మారిపోయింది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 30, 2021, 06:55 PM IST
  • అస్తమించిన పాటల శిఖరం సిరివెన్నెల సీతారామశాస్త్రి
  • సిరివెన్నెల సినిమాకు మొదటిసారిగా సింగిల్ కార్డ్ రాసిన సీతారామశాస్త్రి
  • ఆ సినిమాతోనే సిరివెన్నెల సీతారామశాస్త్రిగా మారిన చేంబోలు సీతారామశాస్త్రి
 Sirivennela: చేంబోలు సీతారామశాస్త్రి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఎలా మారారు?

Sirivennela Seethamarasastri: పాటల శిఖరం సిరివెన్నెల అస్తమయం తెలుగు సినీ లోకాన్ని విషాదంలో ముంచెత్తింది. దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram Srinivas) చెప్పినట్లు తెలుగు సినీ ప్రేక్షకుడి స్థాయిని పెంచిన కవి సిరివెన్నెల (Sirivennela Seethamarasastri). తెలుగు సినిమాపై తనదైన సాహిత్య ముద్ర వేసిన సిరివెన్నెలను కోల్పోవడం పరిశ్రమకు తీరని లోటు అని చెప్పాలి. సిరివెన్నెల అస్తమయంతో ఆయన పాటలు, మాటలు, నేపథ్యాన్ని సినీ ప్రేక్షకులు మరోసారి గుర్తుచేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆయనకు ఆ పేరెలా వచ్చిందో తెలుసుకుందాం...

నిజానికి సిరివెన్నెల అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి (Sirivennela Seethamarasastri). మే 20, 1955న విశాఖ జిల్లా అనకాపల్లిలో  డాక్టర్ సీవీ యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు జన్మించారు. కాకినాడలో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. ఆ తర్వాత విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వ విద్యాలయంలో (Andhra University) ఎంఏ పూర్తి చేశారు. ఆ తర్వాత కొంతకాలం పాటు ఉద్యోగం చేశారు. ఆ సమయంలో 'భరణి' కలం పేరుతో కవిత్వం రాశారు.

ఆ కవిత్వం దర్శకుడు, కళాతపస్వీ కె.విశ్వనాథ్ (K Vishwanath) దృష్టికి వెళ్లింది. దీంతో విశ్వనాథ్ సీతారామశాస్త్రిని (Sirivennela Seethamarasastri) పిలిపించి 'జననీ జన్మభూమి' అనే సినిమాలో పాట రాసే అవకాశం కల్పించారు. ఆ సినిమాలో 'తడిసిన అందాలలో..' అనే పాటను సీతారామశాస్త్రి రాశారు. ఆ తర్వాత విశ్వనాథ్ తెరకెక్కించిన 'సిరివెన్నెల' సినిమాలో అన్ని పాటలు రాసే అవకాశాన్ని సీతారామశాస్త్రికి ఇచ్చారు. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్న సీతారామశాస్త్రి అద్భుతమైన పాటలు రాశారు.

Also Read: Sirivennela: అక్షరాలతో సిరివెన్నెల చేసిన భావ విన్యాసాలు చరిత్రలో నిలిచిపోతాయి: జగన్

సిరివెన్నెల (Sirivennela) సినిమాలోని 'విధాత తలపున ప్రభవించినది..', 'ఆది భిక్షువు వాడినేది కోరేదీ..', 'ఈ గాలీ.. ఈ నేల..' వంటి పాటలు ఎవర్‌గ్రీన్ క్లాసిక్స్‌గా నిలిచిపోయాయి. ఆ సినిమాతో సీతారామశాస్త్రి పేరు ముందు సిరివెన్నెల వచ్చి చేరింది. అలా ఆయన 'సిరివెన్నెల సీతారామశాస్త్రిగా (Sirivennela Seethamarasastri) మారారు. కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన... హైదరాబాద్‌లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం (నవంబర్ 30) సాయంత్రం కన్నుమూశారు. ఆయన మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News