Mystery Hut on Moon: చైనా మూన్ రోవర్ యుటు-2 (Yutu-2 moon rover) చంద్రుడి ఉపరితలంపై ఓ మిస్టరీ వస్తువును గుర్తించింది. క్యూబ్ ఆకారంలో ఉన్న ఆ వస్తువుకు సంబంధించిన ఫోటోలను చైనా (China) స్పేస్ ఏజెన్సీ గత వారం విడుదల చేసింది. చంద్రునికి అవతలి వైపున వాన్ కర్మన్ బిలం గుండా ప్రయాణిస్తున్నప్పుడు రోవర్ దాన్ని గుర్తించినట్లుగా తెలిపింది. చంద్రుని ఉపరితలం నుంచి ఉత్తర దిక్కున 260 అడుగుల దూరంలో రోవర్ దాన్ని క్యాప్చర్ చేసినట్లు పేర్కొంది. ఆ వస్తువును 'మిస్టరీ హట్'గా చైనా స్పేస్ ఏజెన్సీ అభివర్ణించింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆండ్రూ జోన్స్ అనే జర్నలిస్ట్ చంద్రుడిపై ఆ మిస్టరీ వస్తువు (Mystery object on Moon) ఫోటోలను తన ట్విట్టర్‌లో షేర్ చేశాడు. 'ఇది స్థూపమో లేదా ఏలియన్సో కాదు. అయితే ఇది ఏమై ఉంటుందో శోధించాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడున్న ఫోటోలో అదేంటో గుర్తించడం కష్టం. కొన్నిసార్లు పెద్ద పెద్ద బండరాళ్లు కొన్ని చర్యలకు గురై ఇలా బయటకు రావొచ్చు.' అని పేర్కొన్నాడు.


సోషల్ మీడియాలో ఆ మిస్టరీ హట్ (Mystery hut on Moon Surface) ఫోటోలు వైరల్ కావడంతో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఓ నెటిజన్ దీనిపై స్పందిస్తూ...'మీరు ఊహించగలరా... ఒకవేళ అది పురాతన నాగరితకు సంబంధించిన కళాఖండమై... మిలియన్ సంవత్సరాల క్రితం భూమి ఎలా ఉందో చూపించే మ్యాప్‌కు సంబంధించిన వస్తువైతే... ఇదంతా మంచి సినిమా అవుతుంది...' అంటూ పేర్కొన్నాడు. మరో నెటిజన్ దాన్ని 'ఏలియెన్స్ అవుట్ పోస్ట్' అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral News) మారాయి. చైనా యుటు-2 మూన్ రోవర్ 2019 నుంచి చంద్రుడిపై అన్వేషణ సాగిస్తోంది. గతంలో ఈ మూన్ రోవర్ ఆకుపచ్చ జెల్ లాంటి ఓ పదార్థాన్ని చంద్రుడి ఉపరితలంపై గుర్తించింది. ఇటీవల ఓ పెంకు లాంటి వస్తువును గుర్తించగా... అది కూడా బండరాయిగా తేలింది.


 



Also Read: కివీస్‌పై ఘన విజయం.. టెస్ట్ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానానికి కైవసం చేసుకున్న టీమిండియా


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook