India back to No.1 spot in ICC Test Rankings: ముంబై వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టుకు గెలిచి సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్.. ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్ (ICC Test Rankings)లో మళ్లీ అగ్రస్థానానికి చేరింది. సోమవారం విడుదల చేసిన ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో భారత్ (India) 124 పాయింట్లతో తొలిస్థానంలో ఉండగా.. 121 పాయింట్లతో న్యూజిలాండ్ (New Zealand) రెండవ స్థానంలో ఉంది. ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్-1లోనూ భారత్, కివీస్ జట్లే ఫైనల్లో తలపడిన విషయం తెలిసిందే. చాంపియన్‌షిప్ ఫైనల్లో ఓడిన భారత్.. కివీస్‌తో ముగిసిన టెస్టు సిరీస్‌ను కైవసం చేసుకోవడంతో ర్యాంకింగ్ మెరుగైంది.
భారత్, న్యూజిలాండ్ (India vs New Zealand) జట్ల తర్వాత ఐసీసీ టెస్ట్ ర్యాంకింగ్స్‌లో ఆస్ట్రేలియా (108), ఇంగ్లండ్ (107), పాకిస్థాన్ (92) జట్లు వరుసగా ఉన్నాయి. దక్షిణాఫ్రికా, శ్రీలంక, వెస్టిండీస్, బంగ్లాదేశ్, జింబాంబ్వే టాప్-10లో ఉన్నాయి. త్వరలోనే టీమిండియా దక్షిణాఫ్రికాకు వెళ్లి మూడు టెస్టులు ఆడనుంది. ఈ సిరీస్ కూడా గెలిస్తే భారత్ అగ్రస్థానం పదిలంగా ఉండనుంది. డిసెంబర్ 17నుంచి ఇరు జట్ల మధ్య తొలి టెస్ట్ ఆరంభం కానుంది. మరోవైపు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు యాషెస్ 2021 కోసం సిద్ధమవుతున్నాయి. అయితే ఈ రెండు జట్లలో ఏ టీం సిరీస్ గెలిచినా టీమిండియాకు ఎలాంటి నష్టం జరిగే అవకాశం లేదు.
Also Read: Delhi Airport: రైల్వే స్టేషన్‌ను తలపిస్తున్న ఢిల్లీ ఎయిర్‌పోర్టు.. అసలు కారణం ఏంటంటే?!!
ఐసీసీ వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ (WTC 2) 2021-23లోనూ టీమిండియా మూడో స్థానంలో నిలిచింది. భారత్ (Team India) ఖాతాలో ప్రస్తుతం 42 పాయింట్లు ఉన్నాయి. టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భాగంగా ఇప్పటివరకు ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లతో ఆరు టెస్టులు ఆడిన భారత్.. మూడు విజయాలు, ఒక ఓటమిని ఎదుర్కొంది. రెండు డ్రాలు ఉన్నాయి. శ్రీలంక రెండు విజయాలతో 100 శాతం ఫలితాలు సాధించి 24 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. పాకిస్తాన్ రెండు విజయాలు, ఒక ఓటమితో 66.66 విజయ శాతంతో రెండో స్థానంలో ఉంది. భారత్ 58.3 విజయ శాతంతో మూడో స్థానంలో నిలిచింది.
🔝
India are back to the No.1 spot in the @MRFWorldwide ICC Men’s Test Team Rankings.#INDvNZ pic.twitter.com/TjI5W7eWmq
— ICC (@ICC) December 6, 2021
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook