kidney sold for iphone: ఐఫోన్ కోసం కిడ్నీ అమ్మేశాడు.. ఇప్పుడేమో..
బీజింగ్: స్మార్ట్ ఫోన్స్ ఇష్టపడే వారిలో యాపిల్ తయారు చేసే ఐఫోన్స్‌కి ఉండే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఖరీదైన ఈ స్మార్ట్ ఫోన్ సాధారణ, మధ్య తరగతి వారికి ఎప్పుడూ ఓ అందని ద్రాక్షలాంటిదే. ప్రతీ ఏడాది కొత్త ఐఫోన్ మార్కెట్‌లోకి విడుదలైనప్పుడు దానిని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరే వారి సంఖ్యకి కొదువే లేదు.
బీజింగ్: స్మార్ట్ ఫోన్స్ ఇష్టపడే వారిలో యాపిల్ తయారు చేసే ఐఫోన్స్‌కి ఉండే క్రేజ్ ఏ రేంజ్‌లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఖరీదైన ఈ స్మార్ట్ ఫోన్ సాధారణ, మధ్య తరగతి వారికి ఎప్పుడూ ఓ అందని ద్రాక్షలాంటిదే. ప్రతీ ఏడాది కొత్త ఐఫోన్ మార్కెట్‌లోకి విడుదలైనప్పుడు దానిని సొంతం చేసుకోవాలని ఉవ్విళ్లూరే వారి సంఖ్యకి కొదువే లేదు. కొన లేని వారు, కొనుగోలు చేసిన వారు ఆ ఐఫోన్ ధరలపై వేసుకునే జోకులు కూడా అన్నీ ఇన్ని కావు. అలా ఐఫోన్ కొత్త మోడల్ విడుదలైన ప్రతీసారి వైరల్ అయ్యే జోక్స్‌లో కిడ్నీ అమ్మి అయినా ఐఫోన్ కొనుక్కోవాలనే జోక్ కూడా ఒకటి. జనం ఇది సరదాగానే చెప్పుకున్నప్పటికీ.. చైనాకు చెందిన ఓ కుర్రాడు దాదాపు 9 ఏళ్ల క్రితమే ఈ జోకుని నిజం చేసి చూపించాడు.
ఏంటి నమ్మలేకపోతున్నారా ? అయితే, మీరు చైనాకు చెందిన వాంగ్‌షాంగ్ గురించి తెలుసుకుని తీరాల్సిందే. 2011లో అప్పుడు కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఐఫోన్, ఐపాడ్‌ని సొంతం చేసుకోవాలని కలలకన్న వాంగ్‌షాంగ్.. అందుకోసం తన దగ్గర డబ్బు లేకపోవడంతో ఏకంగా తన కిడ్నీనే అమ్మేశాడు. కిడ్నీ అమ్మగా వచ్చిన డబ్బులతో తన కోరిక తీర్చుకున్నాడు. కానీ ఆ తర్వాత కొద్దికాలానికే మరో కిడ్నీ పనిచేయడం మానేయడంతో ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో బాధపడతున్నాడు.
Also read : Theatres reopening: థియేటర్స్‌కి అనుమతి.. షరతులు వర్తిస్తాయి
బ్లాక్ మార్కెట్లో సుమారు 4,500 ఆస్ట్రేలియన్ డాలర్లకు కిడ్నీ అమ్మేసిన వాంగ్‌షాంగ్... ఆ డబ్బుతో ఐఫోన్ 4, ఐప్యాడ్ ( iphone 4, Ipad 2 ) కొన్నాడు కానీ ఆ తర్వాత అనారోగ్యంతో మంచంపట్టడంతో అందులోని మజాను ఆస్వాదించలేకపోయాడు. పైగా రెగ్యులర్‌గా డయాలసిస్ ( Dialysis ) చేయించుకుంటే కానీ ప్రాణాలు నిలబడే అవకాశం లేదు.
ఇదిలా ఉండగా, తన కొడుకు బ్లాక్ మార్కెట్‌లో కిడ్నీ అమ్ముకున్నాడనే ( China man sold his kidney for iphone ) విషయం తెలుసుకున్న వాంగ్‌షాంగ్ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వాంగ్‌షాంగ్ తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టిన అక్కడి పోలీసులు.. కిడ్నీ బ్లాక్ మార్కెట్ రాకెట్‌కి ( Kidney black market ) సంబంధించి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయిన వారిలో వాంగ్‌షాంగ్‌కి అక్రమంగా సర్జరీ చేసిన ఐదుగురు వైద్యులు కూడా ఉన్నారు.
Also read : Kajal Aggarwal: ఆచార్య కోసం హనీమూన్ ముగించుకున్న కాజల్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. Android Link - https://bit.ly/3hDyh4G , Apple Link - https://apple.co/3loQYe.
మరిన్ని అప్‌డేట్స్ కోసం https://www.facebook.com/ZeeHindustanTelugu పేజీని లైక్ చేయండి, ట్విటర్‌లో https://twitter.com/ZeeHTelugu పేజీని ఫాలో అవండి