కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు ముంబైలోని తాజ్ కొలాబాలో అక్టోబర్ 30న మూడుముళ్ల బందంతో ఒక్కటయ్యారు. పెళ్లి తరువాత ఈ కొత్త జంట రోజుకో ఫొటోషూట్ చేసి ఆ ఫొటోలు సోషల్ మీడియాలో పంచుకుంటూ వార్తల్లో నిలిచారు.
పెళ్లి తరువాత హనీమూన్ కోసం మాల్దీవులకు వెళ్లిన ఈ జంట అక్కడి సముద్రగర్భంలో దిగిన ఫొటోలు షేర్ చేసి సోషల్ మీడియాని హీటెక్కించారు. అలా పెళ్లి చేసుకుంది మొదలు హనీమూన్ వరకు నిత్యం వార్తల్లో ఉంటూ వచ్చిన ఈ జంట తాజాగా ఆచార్య మూవీ షూటింగ్ కోసం తమ హనీమూన్ ముగించుకున్నట్టు తెలుస్తోంది.
కాజల్ అగర్వాల్, గౌతమ్ కిచ్లు హనీమూన్ ( Kajal Aggarwal honeymoon ) నుండి తిరిగి వచ్చి, తమ కుటుంబ సభ్యులతో కలిసి భాయ్ దూజ్ జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఈ కొత్త జంట తమ సోదర, సోదరీమణులను కలుసుకుని తమ కుటుంబసభ్యులతో కలిసి ఎంజాయ్ చేశారు.
కాజల్ అగర్వాల్ కిచ్లు త్వరలోనే తిరిగి షూటింగ్‌కి హాజరు కావాలని నిర్ణయించుకుందని... అందుకే హనీమూన్‌ని త్వరగానే ముగించుకుని తిరిగివచ్చినట్టు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. కాజల్ డిసెంబర్ 5 నుండి హైదరాబాద్‌లో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ సినిమా సెట్స్‌కి ( Acharya movie shooting ) హాజరుకానుంది.