China-Taiwan tensions: తైవాన్‌ను చైనాలో కలుపుకుంటామంటున్న చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
China-Taiwan tensions : తైవాన్ భవిష్యత్తు దేశ ప్రజల చేతుల్లోనే ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు ప్రకటన చేసిన కొద్దిసేపటికే షీ జిన్‌పింగ్ రియాక్ట్ అయ్యారు. తైవాన్ తనకు తాను స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకుంది. కానీ తైవాన్ తమ ప్రావిన్స్ అంటూ చైనా పేర్కొంటుంది.
Chinese President Xi Jinping Vows "Peaceful Reunification" With Taiwan: తైవాన్ ఏకీకరణను శాంతియుతంగా చేపట్టనున్నట్లు చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ తెలిపారు. తైవాన్‌ను (Taiwan) చైనాలో (China) కలుపుకోవాలన్న లక్ష్యాన్ని కచ్చితంగా పూర్తి చేస్తామని అని ఆయన అన్నారు. తైవాన్ భవిష్యత్తు దేశ ప్రజల చేతుల్లోనే ఉన్నట్లు ఆ దేశాధ్యక్షుడు ప్రకటన చేసిన కొద్దిసేపటికే షీ జిన్‌పింగ్ (Xi Jinping) ఇలా రియాక్ట్ అయ్యారు. తైవాన్ తనకు తాను స్వతంత్య్ర దేశంగా ప్రకటించుకుంది. కానీ తైవాన్ (Taiwan) తమ ప్రావిన్స్ అంటూ చైనా పేర్కొంటుంది.
అంతేకాదు ఏకీకరణ కోసం తైవాన్‌పై దళాలను కూడా వినియోగించేందుకు వెనుకాడేదిలేదంటూ ఇటీవల చైనా (China) పేర్కొంది. సుమారు 150 చైనా యుద్ధ విమానాలు ఇటీవల తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్‌లోకి ప్రవేశించాయి. దీంతో తైవాన్ (Taiwan) ఆందోళన వ్యక్తం చేసింది. తమ దేశాన్ని చైనా ఆక్రమించేస్తుందని తైవాన్ పేర్కొంది.
Also Read : Afghanistan: తాలిబన్లతో చర్చలు జరపనున్న అమెరికా, అది మాత్రం కుదరదంటున్న యూఎస్
1911లో జరిగిన ఉద్యమ వార్షికోత్సవం సందర్భంగా చైనా (China) అధ్యక్షుడు షీ జిన్‌పింగ్ మాట్లాడారు. మాతృభూమిని ఏకీకరించాలన్న చరిత్రాత్మక లక్ష్యాన్ని చేరుకోవాలని, కచ్చితంగా ఆ లక్ష్యాన్ని సాధిస్తామని జిన్‌పింగ్ (Xi Jinping) చెప్పారు. ఒక దేశం రెండు వ్యవస్థల విధానం ప్రకారమే ఏకీకరణ జరగాలని వెల్లడించారు. తైవాన్ వ్యక్తిగత వేర్పాటువాదంతో మాతృభూమి ఏకీకరణ సమస్యగా మారిందన్నారు. అయితే ఒక దేశం.. రెండు వ్యవస్థల విధానాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తైవాన్ (Taiwan) తెలిపింది.
Also Read : Update on MAA Election Results: రేపే 'మా' ఎన్నికలు.. రేపే ఫలితాల వెల్లడి
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook