Afghanistan: ఆఫ్ఘనిస్తాన్ నుంచి సైనిక దళాల్ని ఉపసంహరించుకున్న అమెరికా తాలిబన్లతో చర్చలకు మాత్రం సై అంటోంది. ఓ వైపు ఆప్ఘనిస్తాన్‌లో ఉగ్రవాదం పెరిగిపోయిందనే విమర్శలు వస్తుంటే..అమెరికా చర్చలకు సిద్ధం కావడం ఆసక్తి రేపుతోంది.
ఆప్ఘనిస్తాన్‌ను(Afghanistan) తాలిబన్లు ఆక్రమించి అప్పుడే రెండు నెలలు కావస్తోంది. ఓ వైపు ఆ దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కువయ్యాయనే విమర్శ ఉంది. ఆ దేశం నుంచి అమెరికా తన సైనిక బలగాల్ని ఉపసంహరించుకోవడం వల్లనే తాలిబన్లకు ఇదంతా సాధ్యమైందనే విమర్శలు కూడా ఉన్నాయి. ఆప్ఘనిస్తాన్ నుంచి చాలా దేశాలకు వర్తక వాణిజ్యం కూడా నిలిచిపోయింది. ఫలితంగా ప్రపంచ ఆర్ధిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడింది. ఓ వైపు విమర్శలు వస్తుంటే మరోవైపు అమెరికా తాలిబన్లతో చర్చలకు సిద్ధమైంది. ఆగస్టు 31న ఆఫ్ఘన్ నుంచి సైనిక బలగాల్ని ఉపసంహరించుకున్న అనంతరం తిరిగి ఆ దేశ పరిణామాల్లో అమెరికా తలదూర్చలేదు. అయితే ఆ దేశంలో జరుగుతున్న పౌర హక్కుల ఉల్లంఘనపై మాత్రం తాలిబన్లను నిలదీస్తోంది.
ఇప్పుడు కొత్తగా ఆ దేశంతో అంటే తాలిబన్లతో(Tallibans)చర్చలకు అమెరికా సిద్ధమైంది. వర్తక వాణిజ్యాల పునరుద్ధరణే చర్చల్లో ప్రధాన ఎజెండాగా ఉంది. చర్చల సందర్బంగా తాలినబ్లకు పలు షరతులు విధించాలని భావిస్తోంది. మరోవైపు ఓ విషయంపై స్పష్టత ఇచ్చింది. తాలిబన్లతో చర్చలకు సిద్ధమైనా సరే..అక్కడి ప్రభుత్వాన్ని మాత్రం గుర్తించమని స్పష్టం చేసింది. తాలిబన్లు ఇప్పటికీ ఉగ్రవాద అనుబంధ సంస్థగానే ఉన్నారని..తాలిబన్లు మారారని నమ్మకం కలిగినప్పుడే ప్రభుత్వాన్ని గుర్తించే విషయాన్ని పరిశీలిస్తామని తెలిపింది. అమెరికా తరపు ప్రతినిధులు నేరుగా తాలిబన్లతో చర్చలు జరపబోతున్నారు. వాణిజ్య అంశాలతో పాటు ఎగుమతులు-దిగుమతుల కొనసాగింపు వంటి విషయాల్ని చర్చించనున్నారు. మానవ హక్కుల విషయంలో ముఖ్యంగా మహిళలు,పిల్లల హక్కుల్ని పరిరక్షించే డిమాండ్ సైతం తాలిబన్ల ముందుంచాలని అమెరికా(America)భావిస్తోంది.
Also read: US Nuclear Submarine: యూఎస్ అణు జలాంతర్గామికి ప్రమాదం, చైనా ఆందోళన
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook