China warns Japan: ఇరుగుపొరుగు దేశాలతో చైనాకు ఘర్షణ ఇంకా కొనసాగుతోంది. ఇప్పుడు జపాన్-చైనా దేశాల మధ్య వివాదం రాజుకుంటోంది. ఏకంగా జపాన్‌ను తీవ్రంగా హెచ్చరించింది.
డ్రాగన్ దేశం(Dragon Country)..ఇరుగు పొరుగుదేశాలతో వైరం తెచ్చుకుంటోంది. ఇప్పటికే ఇండియా, వియత్నాం, తైవాన్ దేశాలతో ఘర్షణ వైఖరి అవలంభిస్తున్న చైనా..జపాన్‌తో కూడా వివాదం తెచ్చుకుంది. డ్రాగన్ దేశం చైనా..జపాన్‌ను తీవ్రంగా హెచ్చరించింది. సంబంధం లేని విషయాల్లో కలగజేసుకుంటే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని వార్నింగ్ ఇచ్చింది. న్యూక్లియర్ వార్ తప్పదని స్పష్టం చేసింది. జపాన్‌ను హెచ్చరిస్తూ చైనాలోని కమ్యూనిస్టు పార్టీ అధికారిక ఛానెల్ ఓ వీడియోను ప్రసారం చేసింది.
తైవాన్(Taiwan) విషయాన్ని చైనా అంతర్గతంగా భావిస్తోంది. తైవాన్ విషయంలో జోక్యం చేసుకుంటే ఊరుకునేది లేదని చెబుతోంది. అవసరమైతే అణు ఆయుధాలు ప్రయోగిస్తామని జపాన్(Japan)ను హెచ్చరించింది చైనా. తైవాన్ విషయంలో కలుగ జేసుకున్నందుకు జపాన్‌పై బాంబులు వేస్తామని(China warns japan)హెచ్చరించింది. తరువాత లొంగిపోయామని బతిమాలుకునేవరకూ మళ్లీ బాంబులేస్తామని వెల్లడించింది. తైవాన్ విముక్తి తమ చేతుల్లో అంశమని..జపాన్ జోక్యం సహించే ప్రసక్తే లేదని స్పష్టం చేసింది. జపాన్‌కు సంబంధించి ఏ ఒక్క యుద్ధ విమానం గానీ, సైనికుడు గానీ తైవాన్ సరిహద్దులో కన్పించినా..జపాన్ దేశాన్ని నామరూపాల్లేకుండా చేస్తామని హెచ్చరిస్తోంది.
Also read: London New Virus: లండన్‌లో మరో కొత్త వైరస్, గణనీయంగా పెరుగుతున్న కేసులు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook