Heavy Rains and Floods kill at least 149 in Democratic Republic of the Congo: గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా డెమొక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో అతలాకుతలం అవుతోంది. ముఖ్యంగా కాంగో రాజధాని కిన్షాసాలో భారీ వరదలు విలయం సృష్టిస్తున్నాయి. భారీ వరదల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో దాదాపుగా 120 మంది మరణించినట్లు రాయిటర్స్ తమ నివేదికలో పేర్కొంది. ఈ సంఖ్య ఎక్కువగానే ఉంటుందని సమాచారం తెలుస్తోంది. భారీ వర్షాల కారణంగా కాంగోలో ప్రస్తుతం జన జీవితం పూర్తిగా స్తంభించిపోయింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

సెంట్రల్ ఆఫ్రికాలోని కాంగో దేశ రాజధాని కిన్షాసాలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా వరదలు బీభత్సవం సృష్టించాయి. దాదాపుగా 1.5 కోట్ల జనాభా ఉన్న కన్షాసా భారీ వరదల వల్ల పూర్తిగా దెబ్బతింది. వరదలకు కొండచరియలు విరిగిపడి 120 మంది మరణించారు. ఇళ్లులు నేలమట్టం అయ్యాయి. కిన్షాసాలోన్నీ చాలా ప్రాంతాలు బురద నీటితో నిండిపోయాయి. ఇక నగరంలోని ప్రధాన రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. రాజధాని కిన్షాసాను ఇతర ప్రాంతాలతో కలిపే రోడ్లు వరద నీటితో మునిగిపోయాయి.


కిన్షాసా, మటాడి యొక్క ప్రధాన ఓడరేవును కలిపే N1 హైవే పూర్తిగా జలమయమయింది. N1ని 3-4 రోజుల పాటు మూసివేస్తున్నట్లు కాంగో ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. కాంగో ఆరోగ్య మంత్రి జీన్ జాక్వెస్ మీడియాతో మాట్లాడుతూ.. భారీ వరదల వల్ల 141 మంది మరణించినట్లు తెలిపారు. అయితే ఈ సంఖ్యను ఇతర విభాగాలతో క్రాస్ చెక్ చేయాల్సిన అవసరం ఉందన్నారు. దేశంలో మూడు రోజుల పాటు సంతాప దినాలను ప్రకటిస్తున్నట్లు చెప్పారు. 



కాంగో నది ఒడ్డున కిన్షాసా ఓ మత్స్యకార గ్రామం. క్రమక్రమంగా అభివృద్ధి చెందుతూ 1.5 కోట్ల జనాభాతో ఆఫ్రికాలోనే మెగా సిటీలలో ఒకటిగా ఎదిగింది. నది చుట్టూ భారీగా నిర్మాణాలు ఉన్నాయి. వాతావరణ మార్పులు, పట్టణీకరణం కారణంగా తరుచుగా కిన్షాసాలో భారీ వర్షాలు, వరదలు సంభవిస్తున్నట్లు పర్యావరణవేత్తలు పేర్కొన్నారు. 2019 నవంబర్ నెలలో కిన్షాసాలో భారీ వరదలు సంభవించాయి. అప్పుడు కొండచరియలు విరిగిపడి 40 మంది చనిపోయారు. అప్పటికంటే మూడురెట్లు ఎక్కువగా ఇప్పుడు వచ్చాయి. 


Also Read: Gold Price Today: బంగారం ప్రియులకు ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే?


Also Read: Wednesday Remedies: బుధవారం నాడు ఈ చిన్న పరిహారాలు చేస్తే.. ప్రతి పనిలో విజయం మీదే! ఆర్థిక సమస్యలు దూరం  


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  


ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 


ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook.