కరోనా వైరస్ బారిన పడి మరణించిన బ్రెజిల్ డాక్టర్ వ్యవహారంపై ఇప్పుడు రాద్ధాంతం చెలరేగుతోంది. వ్యాక్సిన్ ట్రయల్స వల్ల మరణించారంటూ తొలుత వచ్చిన వార్తలు తప్పని...మరో వాదన ప్రారంభమైందిప్పుడు.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


కోవిడ్-19 (Coronavirus) వ్యాక్సిన్‌ను ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ (AstraZeneca Vaccine) సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ వ్యాక్సిన్ చివరిదశ ప్రయోగాల్లో ఓ వాలంటీర్ అస్వస్థతకు గురికావడంతో ప్రపంచవ్యాప్తంగా క్లినికల్ ట్రయల్స్‌ (clinical trials) ను తాత్కాలికంగా నిలిపివేసి.. మళ్లీ పున:ప్రారంభించారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్‌లో విషాదం చోటుచేసుకుంది. చివరిదశ ప్రయోగాల్లో భాగంగా ఆస్ట్రాజెనెకా-ఆక్స్‌ఫర్డ్ వ్యాక్సిన్‌ (Coronavirus vaccine) తీసుకున్న బ్రెజిల్ కు చెందిన డాక్టర్  జోవా పెడ్రో రో ఫైటోసా మరణించడం సంచలనంగా మారింది. వ్యాక్సిన్ ట్రయల్స్  ( Vaccine Trials ) వికటించడం వల్లనే డాక్టర్ మరణించినట్టు ముందు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు మరో వాదన ప్రారంభమైంది. డాక్టర్ మరణానికి కారణం వ్యాక్సిన్ కాదని...ఇతర ఆరోగ్య కారణాలున్నాయనే వాదన వస్తోంది. 


ఇప్పుడీ విషయంపై ప్రపంచ వ్యాప్తంగా రాద్ధాంతం రేగుతోంది. రియో డీ జెనెరోకు చెందిన డాక్టర్‌ జోవా పెడ్రో రో ఫైటోసా కరోనా వైరస్‌ కారణంగా అనారోగ్యానికి గురై అక్టోబర్‌ 15న మరణించారు. ఈయన ఆస్ట్రాజెనెకా - ఆక్స్‌ఫర్డ్‌  ( AstraZeneca - oxford  ) యూనివర్శిటీ సంయుక్తంగా అబివృద్ధి చేస్తున్న కరోనా వ్యాక్సిన్‌ ట్రయల్స్‌లో పాల్గొన్నారని..అది వికటించవల్ల మరణించారని వార్తలు రావడంతో పరిశోధకులు వెంటనే ట్రయల్స్ నిలిపివేశారు.


అయితే తరువాత మరో వాదన ప్రారంభమైంది. వ్యాక్సిన్‌ కంటే కరోనా ప్రభావం నుంచి బయట పడేందుకు ఆ డాక్టర్ వాడిన మందుల వల్లనే మరణించారని ట్రయల్స్‌ సన్నిహిత వర్గాల్ని ఉద్దేశిస్తూ..బ్రెజిల్‌ పత్రిక గ్లోబో, వార్తా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌ వెల్లడించింది. రియో డీ జెనెరోలోని రెండు ఆస్పత్రుల్లోని ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్లలో డాక్టర్‌ జోవా మార్చి నెల నుంచి పని చేస్తున్నారు.  ప్రధానంగా కరోనా రోగులకు వైద్య చికిత్సలు చేస్తున్నారు. డాక్టర్‌ జావో రోగుల నుంచి  కరోనా వైరస్‌ సోకకుండా తగిన రక్షణ చర్యలు తీసుకోకపోవడం వల్లనే వైరస్‌ బారిన పడినట్లు సావో పావ్లో ఫెడరల్‌ యూనివర్శిటీ వర్గాలు తెలిపాయి. 


కుటుంబసభ్యులు మాత్రం ఆరోగ్యంగా ఉన్న యువ డాక్టర్‌ కరోనా కారణంగా చనిపోవడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఇక వ్యాక్సిన్‌ ట్రయల్స్ ( Vaccine Trials )ను నిలిపి వేయడం లేదని, స్వతంత్ర కమిటీ తమకు ఈ విషయంలో గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చిందని బ్రెజిల్‌లో ఆక్స్‌ఫర్డ్‌ వ్యాక్సిన్‌ ( Oxford Vaccine ) మూడవ ట్రయల్స్‌ నిర్వహిస్తున్న పావ్లో యూనివర్శిటీ వర్గాలు ప్రకటించాయి. Also read: Coronavirus: ఆ మహిళ మరణానికి కారణం కరోనా వైరస్