టెహ్రాన్ : ప్రపంచాన్ని క్షణ క్షణం కలవరపెడుతోన్న కరోనా వైరస్, ఇప్పటివరకు దీని బారిన పడి మరణాలు తక్కవే సంభవించినప్పటికీ ఆందోళన మాత్రం తగ్గడంలేదు. కరోనాపై రకరకాల పుకార్లతో ప్రజల్లో మరింత భయం పెరుగుతూపోతోంది. నిజానికి కరోనా సోకినప్పటికీ లేని ఆందోళన, చిన్న చిన్న వదంతులే కలవరపెడుతున్నాయి.   
 
ఇటువంటు వదంతుల్లో ఒకటి.. మద్యం తాగితే కరోనా నయమవుతుందని, రోగనిరోధక శక్తి పెరుగుతుందని, ఇరాన్ లో అక్కడి మద్యం రకాలో ఒకటైన నాటుసారా సేవించి 27 మంది చనిపోగా, మరో 218 మంది తీవ్ర అస్వస్థతకు గురికావడంతో దగ్గర్లోని స్థానిక ఆసుపత్రికి తరలించారని తెలిపారు. 


మరో వైపు సోమవారం కరోనాతో ఇరాన్ లో 43 మంది చనిపోగా.. కొత్తగా 595 కేసులు నమోదయ్యాయని, కాగా ఇప్పటివరకు ఇరాన్ లో 237 మంది మంది మరణించారని అధికారికంగా వెల్లడించారు. దీంతో మరో 7 వేల మందికి కరోనా వైరస్ సోకడంతో.. ఇరాన్ ప్రభుత్వం 70 వేల మంది ఖైదీలను విడుదల చేసింది. ఇప్పటికి ఈ వైరస్ బారి నుంచి ఒక లక్షకు పైగా మందికి సోకినట్లు ఆధారాలు ఉన్నాయని అధికారికంగా వెల్లడించారు.  
జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..