Corona in China: కరోనా పుట్టినిల్లు చైనాలో పరిస్థితులు రోజు రోజుకు ఆందోళనకరంగా మారుతున్నాయి. ప్రపంచ దేశాలు కరోనా వల్ల అద్వాన్న పరిస్థితులు ఎదుర్కొంటున్న సమయంలో.. కొవిడ్​ను సమర్థంగా ఎదుర్కొంటున్నట్లు ప్రకటించుకున్న చైనా.. ఇప్పుడు తీవ్ర పరిస్థితులు ఎదుర్కొంటోంది. రోజువారి కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. దీనితో ఆ దేశంలోనే అతిపెద్ద నగరమైన షాంఘైలో కఠిన ఆంక్షలు అమలు చేస్తేంది ప్రభుత్వం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కఠిన ఆంక్షలతో జనం విల విల..


కొవిడ్​ను అదుపు చేసేందుకు ప్రభుత్వం అమలు చేస్తున్న కఠిన నిబంధనల కారణంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కనీసం ఆహారంకోసం కూడా బయటకు వెళ్లలేని పరిస్థితులు కొన్ని ప్రాంతాల్లో కనిపిస్తున్నట్లు సమాచారం.


తాజాగా చైనాలో పరిస్థితులు ఎలా ఉన్నాయో చూపిస్తున్న ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఉన్న దృశ్యాలు చూస్తే.. అక్కడ పరిస్థితులు ఎంతగా దిగజారుతున్నాయో, అధికారులు ఎలా ప్రజలను ఆందోళనలకు గురి చేస్తున్నారో కళ్లకు కట్టినట్లు తెలుస్తోంది.


షాంఘైలోని ఓ ప్రాంతంలోని కమ్యునిటీలోకి పీపీఈ కిట్లు ధరించి వచ్చిన పోలీసులు.. కొవిడ్ సోకినవారందరు సరెండర్ కావాలని హెచ్చరించారు. హెచ్చరికలు పట్టించుకోనివారిని బలవంతంగా ఈడ్చుకెళ్లడం ఈ వీడియోలో చూడొచ్చు.


తమ వాళ్లను బలవంతంగా తీసుకెళ్లడం చూసి ఇంట్లోని ఇతర సభ్యుల రోదనలు ఈ వీడియోలో ఉన్నాయి. మహిళలు కాళ్లు పట్టుకుని బతిమాలినా కనికరించడం లేదు పోలీసులు. ఫ్లాట్లు వదిలి బయటకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నట్లు కొందరు మహిళలు ఆరోపిస్తున్నారు. దీని ద్వారా కనీసం ఆహారం కూడా తెచ్చుకోలేని పరిస్థితులు ఏర్పడినట్లు స్థానికులు వాపోతున్నారు.


అసలు కొవిడ్​పై చేసే పోరాటంలో ప్రజలను చైనా అధికారులు ఎలా చూస్తున్నారో తెలుపుతున్నట్లు ఈ వీడియో చూసిన వారు అంటున్నారు. ఏప్రిల్ 14న జరిగినట్లు చూపిస్తున్న ఈ వీడియోను.. ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చూశారు. ఆ భయాణక పరిస్థితులు ఉన్నా వీడియోను మీరు చూడండి.



చైనాలో కొవిడ్ కేసులు ఇలా..


చైనాలో ప్రస్తుతం రోజువారి కేసుల సంఖ్య దాదాపు 20 వేలుగా ఉంది. ఇప్పటి వరకు ఈ దేశంలో మొత్తం 174,868 కేసులు నమోదయ్యాయి. ఇందులో 4,638 మంది మహమ్మారికి బలయ్యారు. 145,352 మంది కొవిడ్​ నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ప్రస్తుతం ఇంకా 24,878 మంది కొవిడ్ చికిత్స తీసుకుంటున్నారు.


Also read: Brooklyn Subway Shooting: బ్రూక్లిన్‌లో కాల్పుల కలకలం.. రక్తసిక్తమైన సబ్‌వే స్టేషన్


Also read: Countries New Names: ప్రపంచంలోని ఆ దేశాల పాత లేదా కొత్త పేర్లు తెలుస


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook