Countries New Names: ప్రపంచంలోని ఆ దేశాల పాత లేదా కొత్త పేర్లు తెలుసా

కాలం మారేకొద్దీ..పాలకులు మారేకొద్దీ నగరాల పేర్లే కాదు దేశాల పేర్లు కూడా మారుతుంటాయి. ప్రపంచంలో అందరికీ తెలిసిన కొన్ని దేశాల పేర్లు గతంలో మరోలా ఉన్నాయి. అటువంటి ఐదు దేశాల పేర్లను పరిశీలిద్దాం..కొత్త పేరేంటి..పాత పేరేంటనేది.

Countries New Names: కాలం మారేకొద్దీ..పాలకులు మారేకొద్దీ నగరాల పేర్లే కాదు దేశాల పేర్లు కూడా మారుతుంటాయి. ప్రపంచంలో అందరికీ తెలిసిన కొన్ని దేశాల పేర్లు గతంలో మరోలా ఉన్నాయి. అటువంటి ఐదు దేశాల పేర్లను పరిశీలిద్దాం..కొత్త పేరేంటి..పాత పేరేంటనేది.
 

1 /5

టర్కీ నుంచి టుర్కియే అందరికీ సుపరిచితమైన ప్రసిద్ధ దేశం టర్కీ. ఇప్పుడా పేరు మారింది. అక్కడి అధ్యక్షుడు ఇర్దెగాన్ ఆ దేశం పేరు మార్చారు. కొత్తగా టుర్కియేగా మార్చారు.

2 /5

స్వాజీలాండ్ నుంచి ఇస్వాతినీ స్వాజీలాండ్ దేశం కూడా 2018 ఏప్రిల్ నెలలో పేరు మార్చుకోవాలని నిర్ణయించుకుంది. స్వాజీలాండ్ పేరు మార్చి..ఇస్వాతినిగా నామకరణం చేసింది. ఇస్వాతిని అంటే ల్యాండ్ ఆఫ్ స్వాజీస్ అని అర్ధం

3 /5

సిలోన్ నుంచి శ్రీలంక పోర్చుగ్రీసు పాలన ఉన్నప్పుడు శ్రీలంకను సిలోన్‌గా పిలిచేవారు. ఆ తరువాత బ్రిటీషు పాలన రావడం, బ్రిటీను నుంచి కూడా స్వాతంత్ర్యం లభించిన తరువాత సిలోన్ తన పేరును శ్రీలంకగా మార్చుకుంది. 2011లో శ్రీలంకగా అధికారికంగా మారింది.

4 /5

హాలండ్ నుంచి నీదర్‌ల్యాండ్ ఇక ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ తెలిసిన దేశం హాలండ్. మార్కెటింగ్ స్ట్రాటెజీలో భాగంగా హాలండ్ దేశం పేరును 2020 జనవరిలో నీదర్‌ల్యాండ్‌గా మార్చారు. 

5 /5

చెక్ రిపబ్లిక్ నుంచి చెకియా చెక్ రిపబ్లిక్ అందరికీ తెలిసిన కమ్యూనిస్టు దేశం. 2016 ఏప్రిల్ నుంచి చెక్ రిపబ్లిక్ కాస్తా చెకియాగా మారింది. పేరు మార్పుపై దేశంలో ఏకంగా 20 ఏళ్ల పాటు చర్చ సాగింది