Brooklyn Subway Shooting: బ్రూక్లిన్‌లో కాల్పుల కలకలం.. రక్తసిక్తమైన సబ్‌వే స్టేషన్

Brooklyn Subway Shooting: కాల్పుల ఘటనతో బ్రూక్లిన్ సబ్‌వే రక్తసిక్తమైంది. రక్తమోడిన గాయాలతో పలువురు ప్రయాణికులు రైలులోంచి బయటికి వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాడి జరిగిన అనంతరం సబ్‌వేలో పొగ కమ్ముకోవడంతో అక్కడేం జరుగుతుందో ప్రయాణికులకు కాసేపు అర్థం కాలేదని ప్రత్యక్షసాక్షులు తెలిపారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Apr 13, 2022, 10:37 AM IST
  • అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం
  • ఉదయం జనంతో రద్దీగా ఉన్న సమయంలో సబ్‌వే స్టేషన్‌లో కాల్పులు
  • కాల్పుల ఘటనతో రక్తసిక్తమైన బ్రూక్లిన్ 36వ స్ట్రీట్ సబ్‌వే స్టేషన్
Brooklyn Subway Shooting: బ్రూక్లిన్‌లో కాల్పుల కలకలం.. రక్తసిక్తమైన సబ్‌వే స్టేషన్

Brooklyn Subway Shooting Live Updates: న్యూయార్క్: అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం చోటుచేసుకుంది. న్యూయార్క్‌లోని బ్రూక్లిన్‌ నగరం మంగళవారం ఉదయం కాల్పులతో ఉలిక్కిపడింది. అమెరికా స్థానిక కాలమానం ప్రకారం బ్రూక్లిన్‌లోని 36వ స్ట్రీట్ సబ్‌వే స్టేషన్‌లో ఉదయం 8:30 గంటలకు జనంతో రద్దీగా ఉన్న సమయంలో ఓ గుర్తుతెలియని ఆగంతకుడు కాల్పులకు పాల్పడ్డాడు. కాల్పులకు పాల్పడిన దుండగుడు నిర్మాణరంగంలో పనిచేసే కార్మికులు ధరించే దుస్తులతో పాటు గ్యాస్ మాస్క్ ధరించిన వచ్చి ఈ అఘాయిత్యానికి పాల్పడినట్టు తెలుస్తోంది. ఆగంతకుడి దాడిలో 8 మంది వరకు గాయపడినట్టు తొలుత వార్తలొచ్చినప్పటికీ.. తర్వాత ఆ సంఖ్య 16 మందికి పెరిగినట్టు సమాచారం.

కాల్పుల ఘటనతో బ్రూక్లిన్ సబ్‌వే స్టేషన్ రక్తసిక్తమైంది. రక్తమోడిన గాయాలతో పలువురు ప్రయాణికులు రైలులోంచి బయటికి వస్తున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దాడి జరిగిన అనంతరం సబ్‌వేలో పొగ కమ్ముకోవడంతో అక్కడేం జరుగుతుందో ప్రయాణికులకు కాసేపు అర్థం కాలేదని ప్రత్యక్షసాక్షులు తెలిపారు. అగ్నిమాపక శాఖ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలానికి చేరుకునేలోపే బ్రూక్లిన్ సబ్‌వే నెత్తురోడుతున్న గాయాలతో బాధపడుతున్న బాధితుల ఆర్తనాదాలు , రక్తసిక్తమైన సబ్ వే పరిసరాలే దర్శనమిచ్చాయని ప్రత్యక్షసాక్షులు వెల్లడించారు.

Also read : Countries New Names: ప్రపంచంలోని ఆ దేశాల పాత లేదా కొత్త పేర్లు తెలుసా

Also read : Cold Cities: ఇండియాలో తీవ్రమైన ఎండలు, అక్కడ మాత్రం గడ్డకట్టే చలి, మోస్ట్ కోల్డెస్ట్ సిటీస్

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News