మీ కళ్లు అలా మారితే కోవిడ్ పరీక్షలు తప్పనిసరి!
ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. కరోనా కేసుల (CoronaVirus New Symptoms) సంఖ్య 29లక్షలకు పైమాటే.
కరోనా వైరస్ కారణంగా ప్రపంచ వ్యాప్తంగా 2 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. కరోనా కేసుల సంఖ్య 29లక్షలకు పైమాటే. ఇందులో 8లక్షల మంది చికిత్స తర్వాత మహమ్మారి బారి నుంచి ప్రాణాలతో బయటపడ్డారు. కరోనా వైరస్ ముక్కు, నోటి ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తుందని ఇది వరకే తెలుసు. ఈ క్రమంలో మరో ఆసక్తికర విషయం వెలుగుచూసింది. కళ్లను చేతి వేళ్లతో అసలు తాకకూడదని అందుకు కారణాన్ని రీసెర్చర్లు వివరించారు. Photos: కబాలి బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు
వైరస్ ముక్కు, నోటితో పాటు కళ్లల్లోనూ అభివృద్ధి చెందుతుందట. కళ్లు లేత గులాబీ రంగులోకి మారడం కూడా కరోనా వైరస్ ముందస్తు లక్షణం కావొచ్చునని హెచ్చరిస్తున్నారు. కరోనా నుంచి కోలుకున్న ఓ బాధితురాలిని పరిశీలించిన తర్వాత డాక్టర్లు నిర్ధారించారు. కన్నీరుతో పాటు కంటి నుంచి వచ్చే ఇతర స్రావాల ద్వారా సైతం ప్రాణాంతక కరోనా వైరస్ ఇతరులకు సోకే అవకాశం ఉందని ఇటలీ రీసెర్చర్లు తాజాగా గుర్తించారు. బ్రేకింగ్: ఏపీలో తాజాగా 81 కరోనా కేసులు
జనవరి చివరి వారంలో ఓ మహిళ చైనా, హుహాన్ నుంచి ఇటలీకి తిరిగొచ్చింది. ఐదు రోజుల తర్వాత దగ్గు, గొంతు ఇన్‌ఫెక్షన్ సమస్యలతో ఆసుపత్రిలో చేరింది. మూడో రోజు వైద్యులు ఆమె కళ్లను శుభ్రం చేసి ఆర్ఎన్ఏలో వైరస్‌ను కనుగొన్నారు. ఆమె కంటి నుంచి స్రావాలను సేకరించి భద్రపరిచారు. 21 రోజుల తర్వాత కూడా కంటి స్రావాలలో వైరస్ బతికే ఉందని, కంటికి జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అదే సమయంలో ముక్కు, నోరు స్రావాలు, ద్రవాలలో వైరస్ కనిపించక పోవడం గమనార్హం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!