Covaxin: ఆ రెండు Covid-19 వేరియంట్లపై కోవాగ్జిన్ మెరుగైన ఫలితాలు, అధ్యయనంలో వెల్లడి
Covaxin Covid-19 Vaccine: భారత్ బయోటెక్ కొవాగ్జిన్ కరోనా టీకాలపై అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం నిర్వహించింది. ఇండియాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమైన ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కోవాగ్జిన్ కోవిడ్19 వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలింది.
Covaxin Covid-19 Vaccine: భారత్ బయోటెక్ రూపొందించిన కోవాగ్జిన్ కరోనా వ్యాక్సిన్‌కు త్వరలోనే అమెరికాలో ఆమోదం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇండియాలో కరోనా వేగంగా వ్యాప్తి చెందేందుకు కారణమైన ఆల్ఫా, డెల్టా వేరియంట్లపై కోవాగ్జిన్ కోవిడ్19 వ్యాక్సిన్ సమర్థవంతంగా పని చేస్తున్నట్లు తేలింది.
భారత్ బయోటెక్ కొవాగ్జిన్ కరోనా టీకాలపై అమెరికాలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం నిర్వహించింది. SARS-CoV-2 ఆల్ఫా, డెల్టా వేరియంట్లను కోవాగ్జిన్ ప్రభావవంతంగా ఎదుర్కొంటుందని గుర్తించింది. కోవాగ్జిన్ టీకాలు తీసుకున్న కొందరి రక్తం సీరంను సేకరించి ఎన్‌ఐహెచ్ అధ్యయనం చేసింది. ఆల్ఫా లేదా B.1.1.7, డెల్టా లేదా B.1.617 వేరియంట్లపై కోవాగ్జిన్ మెరుగ్గా పనిచేసి ఫలితాన్ని చూపించిందని అధ్యయనంలో తేలింది. ఈ కరోనా వేరియంట్లను నిర్వీర్యం చేయడంతో పాటు యాంటీబాడీలు ఉత్పత్తి చేసినట్లు నిపుణులు గుర్తించారు.
Also Read: Delta Plus Variant of Covid-19: డెల్టా ప్లస్ వేరియంట్‌పై ఆందోళన చెందవద్దు, అవన్నీ అపోహలే: నిపుణులు
ఈ వేరియంట్లలో ఆల్ఫా వేరియంట్‌ను తొలిసారిగా బ్రిటన్‌లో గుర్తించగా, డెల్టా వేరియంట్‌ను భారత్‌లో తొలిసారిగా గుర్తించడం తెలిసిందే. కొవిడ్19 లక్షణాలున్న వారిపై కోవాగ్జిన్ 78 శాతం ప్రభావం చూపినట్లు మూడో దశ ఫలితాలలో తేలింది. భారత్ బయోటెక్ కోవిడ్ వ్యాక్సిన్ కోవాగ్జిన్ తీసుకోవడం ద్వారా ఏ ప్రమాదం లేదని అమెరికా సంస్థ పేర్కొంది. జనవరి 16 నుంచి భారత్‌లో కోవాగ్జిన్‌తో పాటు సీరం ఇన్‌స్టిట్యూట్ కరోనా వ్యాక్సిన్ కోవిషీల్డ్ పంపిణీ చేస్తున్నారు. ఇటీవల రష్యాకు చెందిన స్పుత్నిక్ వి వ్యాక్సిన్ సైతం భారత్‌లో అందుబాటులోకి వచ్చింది.
Also Read: SBI New Charges: జులై 1 నుంచి సామాన్యుడిపై ప్రభావం చూపే 5 కొత్త రూల్స్ ఇవే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook