Covid-19: ఆ దేశ ప్రధానికి కరోనా.. 5 రోజులు పాటు హోం ఐసోలేషన్‌లోనే..!
Canada PM Trudeau: కెనడా ప్రధాని ట్రూడోకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కొద్ది రోజులు ఐసోలేషన్లోకి వెళ్లనున్నట్లు ఆయన తెలిపారు.
Canada prime minister tested positive: కెనడా ప్రధానమంత్రి జస్టిన్ ట్రూడో (Canada PM Trudeau) కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. ''ఈ ఉదయం నాకు కోవిడ్-19 (Covid-19) పాజిటివ్ గా తేలింది. నేను బాగానే ఉన్నాను. నా పని నేను ఒంటరిగా చేసుకుంటున్నాను. దయచేసి ప్రతి ఒక్కరూ టీకాలు వేసుకోండి'' అంటూ ట్రుడో ట్వీట్ చేశారు. అయితే ఈ వ్యాక్సిన్ తీసుకున్న వారిలో ఎక్కువ మంది తీవ్ర అనారోగ్యం బారిన పడకుండా టీకాలు సంరక్షిస్తున్నాయి.
ఐదు రోజుల పాటు హోం ఐసోలేషన్‌లో ఉండనున్నట్లు ట్రుడో తెలిపారు. ప్రధాని ముగ్గురు పిల్లల్లో ఒకరికి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. గతంలో ట్రూడో భార్యకు కొవిడ్ బారిన పడ్డారు. ఆ సమయంలో కూడా ఆయన హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. ప్రపంచంలోనే అత్యధిక శాతం టీకా రేటు కలిగి ఉన్న దేశంగా కెనడా ఉంది. కొవిడ్ ఆంక్షలను తప్పనిసరి చేయడం కారణంగా ఆ దేశ రాజధాని ఒట్టావాలోని పార్లమెంట్ భవనాన్ని చుట్టుముట్టారు నిరసనకారులు. రోడ్లపైకి వచ్చి ట్రాఫిక్‌ను స్తంభింపచేశారు.
ప్రపంచవ్యాప్తంగా కరోనా కల్లోలం కొనసాగుతోంది. కొత్తగా 20,18,209 మందికి కరోనా సోకింది. వైరస్ తో 7,617 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం కేసులు 37,77,21,704కు చేరగా.. మరణాల సంఖ్య 56,91,213కు పెరిగింది. అమెరికాలో కొవిడ్ విజృంభిస్తోంది. తాజాగా 2,74, 266 మందికి కొవిడ్ పాజిటివ్‌గా తేలింది. 1153 మంది మరణించారు. ఫలితంగా మొత్తం కేసుల సంఖ్య 76 కోట్లు దాటింది.
Also Read: Cheslie Kryst: మిస్ యూఎస్ఏ 2019 విజేత 'చెస్లీ క్రిస్ట్' ఆత్మహత్య!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook