ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు కరోనా మహమ్మారితో పోరాటం చేస్తున్నాయి. కరోనాను అరికట్టలేకపోతున్నా, కనీసం వ్యాప్తిని నియంత్రించి మరణాలను అదుపు చేయాలని చేస్తున్న ప్రయత్నాలు విఫలం అవుతున్నాయి. ముఖ్యంగా అమెరికా, బ్రెజిల్ ఆ తర్వాత భారత్‌లో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్నాయి. తాజాగా బ్రెజిల్‌లో కోవిడ్19 మరణాల సంఖ్య (COVID-19 Death Toll in Brazil) 90 వేలకు చేరుకుంది. ఈ విషయాన్ని దేశ వైద్యశాఖ అధికారులు వెల్లడించారు. India: ఒక్కరోజులో 52వేలకు పైగా కరోనా కేసులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

బ్రెజిల్‌లో మొత్తం కరోనా కేసుల సంఖ్య 2.5 మిలియన్లకు చేరుకుంది. ఇప్పటివరకూ కరోనాతో 90,134 మంది మరణించారని తెలిపారు. 22 కోట్ల జనాభా ఉన్న దేశంలో కరోనా టెస్టులు నిత్యం చేస్తూనే ఉండాల్సి వస్తుందని, అయినా పూర్తి స్థాయిలో అందరికీ పరీక్షలు నిర్వహించలేకపోతున్నారని విశ్లేషకులు చెబుతున్నారు. దేశంలో జులై నెలలో ప్రతిరోజూ 1000 వరకు కరోనా మరణాలు సంభవిస్తున్నాయి. వర్మ సెక్సీ హీరోయిన్ Apsara Rani Hot Stills వైరల్  
IPL ఫైనల్ తేదీ మార్పు.. 13 ఏళ్లలో తొలిసారిగా!  


కాగా, అగ్రరాజ్యం అమెరికాలో గడిచిన 24 గంటల్లో 69,074 కరోనా పాజిటివ్ కేసులను నిర్ధారించారు. అదే సమయంలో 1,595 మంది కరోనాతో పోరాడుతూ చనిపోయారు. అమెరికా తర్వాత అత్యధిక కరోనా కేసులు బ్రెజిల్, భారత్‌లో నమోదవుతున్నాయి. భారత్‌లో గత కొన్ని రోజుల నుంచి నిత్యం 45వేలకు పైగా పాజిటివ్ కేసులు, 650కి పైగా మరణాలు సంభవించడం కలవరపెడుతోంది.  Rhea Chakraborty సుశాంత్‌ను వేధించింది: అంకితా లోఖాండే