సుశాంత్‌ను రియా చక్రవర్తి వేధించింది: అంకితా లోఖాండే

నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య కేసు దర్యాప్తును ముంబై, బిహార్ పోలీసులు వేగవంతం చేశారు. లేటెస్ట్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి సుశాంత్‌ను వేధిస్తుండేదని నటుడి మాజీ ప్రేయసి అంకితా లోఖాండే (Ankita Lokhande About Rhea Chakraborty) తెలిపారు.

Last Updated : Jul 30, 2020, 08:56 AM IST
సుశాంత్‌ను రియా చక్రవర్తి వేధించింది: అంకితా లోఖాండే

Ankita Lokhande About Rhea Chakraborty | బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ (Sushant Singh Rajput) కేసులో ఆశ్చర్యకర విషయాలు వెలుగుచూస్తున్నాయి. సుశాంత్‌ను లేటెస్ట్ గాళ్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి వేధించేదని, ఆమె వల్ల అతడికి మానసిక ప్రశాంతత కరువైందని మాజీ ప్రియురాలు అంకితా లోఖాండే (Ankita Lokhande) బిహార్ పోలీసులకు తెలిపారు. సరిగ్గా ఏడాది కిందట ఈ విషయమై తనతో చర్చిస్తూ... సుశాంత్ భావోద్వేగానికి లోనయ్యాడని, రియా చక్రవర్తి (Rhea Chakraborty)తో రిలేషన్‌కు స్వస్తి పలకాలని సైతం భావించాడని కేసు విచారణలో భాగంగా బిహార్ పోలీసులకు వెల్లడించింది. SS Rajamouli: రాజమౌళికి కరోనా పాజిటివ్

తన తొలి సినిమా మణికర్ణిక సమయంలో సుశాంత్ ప్రత్యేకంగా విషెస్ తెలిపాడని అంకిత గుర్తు చేసుకుంది. సుశాంత్ ఆత్మహత్య చేసుకున్న తర్వాత నుంచి ఇప్పటివరకూ రెండుసార్లు పాట్నాకు వెళ్లి అతడి కుటుంబసభ్యులను కలుసుకుని పరామర్శించినట్లు చెప్పింది. సుశాంత్‌తో పాటు అతడి శ్వేతా సింగ్ కీర్తితో తాను చేసిన చాటింగ్ వివరాలను షేర్ చేసుకుంది.  Favivir: రూ.59కే కరోనా ట్యాబ్లెట్.. 

అంకితా లోఖాండే, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌లు దాదాపు ఆరేళ్లు రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. పాపులర్ టీవీ షో ‘పవిత్ర రిస్తా’లో చేస్తున్న సమయంలో మొదలైన పరిచయంతో 2010 నుంచి 2016 వరకు డేటింగ్ చేశారని తెలిసిందే. ఆ తర్వాత సుశాంత్.. నటి రియా చక్రవర్తితో డేటింగ్ చేశాడు. Pics: అందాల ఊర్వశివే.. గుండెల్లో గుచ్చావే.. 

తన కుమారుడు సుశాంత్‌ని అతడి ప్రియురాలు, నటి రియా చక్రవర్తి మోసం చేసిందని.. ఆర్థిక ఇబ్బందులకు గురిచేసిందని ఆరోపిస్తూ నటుడి తండ్రి కేకే సింగ్ పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేశారు.  సుశాంత్ డిప్రెషన్‌తో బాధ పడుతున్నాడని రియా మాకు చెప్పలేదని కేకే సింగ్ వెల్లడించారు. సుశాంత్ ఆత్మహత్యకు రియా చక్రవర్తి కారణమని విచారణ జరపాలని ఫిర్యాదు చేయగా ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు ఓ టీమ్‌గా ముంబై వెళ్లి విచారణ చేపట్టారు.

కాగా, తనపై కేసు నమోదైన తర్వాత నటి రియా చక్రవర్తి కనిపించడం లేదు. ఏ ఫోన్ కాల్స్‌కు స్పందించడం లేదు. తనకు ముందస్తు బెయిల్ కోసం లాయర్ ద్వారా ప్రయత్నాలు చేయడం గమనార్హం.  పోకిరి లేడీ విలన్ Sheeva Rana Hot Photos వైరల్   
నితిన్, షాలిని పెళ్లి వేడుక ఫొటోలు 

 

Trending News