Covid-19 vaccines less effective against Omicron: ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచం మొత్తాన్ని హడలెత్తిస్తోంది. రోజూ ఏదో ఒక చోట ఒమిక్రాన్ కొత్త కేసులు వెలుగులోకి రావడంతో జనాలు భయపడుతున్నారు. అయితే ఒమిక్రాన్ వేరియంట్ కోవిడ్‌19 వ్యాక్సిన్‌ల ప్రభావాన్ని కూడా తగ్గిస్తుందని కొత్తగా ఒక పరిశోధనలో వెల్లడైంది. ఆక్స్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం (University of Oxford) తాజాగా చేపట్టిన అధ్యయనంలో పలు విషయాలు బయటపడ్డాయి. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్‌ (Omicron variant) ప్రభావం.. వ్యాక్సినేషన్‌ తీసుకున్న వారిపై కూడా ఎక్కువ ప్రభావం ఉంటుందని తేలింది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్-19 వ్యాక్సినేషన్ (Covid-19 Vaccination) రెండు డోసులు తీసుకున్న వ్యక్తుల నుంచి సేకరించిన రక్త నమూనాలను పరిశీలించారు. అయితే వ్యాక్సిన్ కు కొత్త స్ట్రెయిన్‌కు (New strain‌) వ్యతిరేకంగా పోరాడేతత్వం తగ్గినట్లు తేలింది. వైరస్ బారినపడకుండా రక్షణగా ఉండే న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్‌లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. డెల్టా వేరియంట్‌తో (Delta variant) పోల్చితే కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వ్యాక్సినేషన్ తీసుకున్న వారిపై కూడా ఎక్కువగా ప్రభావం చూపుతోంది. వ్యాక్సిన్ తీసుకున్న వారి బాడీలో కూడా న్యూట్రలైజింగ్ యాంటీబాడీస్‌లో గణనీయమైన తగ్గుదల కనిపించింది. 


ఫైజర్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్నా కూడా వ్యాక్సినేషన్ పవర్‌‌ను ఒమిక్రాన్ పూర్తిగా తగ్గించగలుగుతోంది. ఆస్ట్రాజెనెకా, జాన్సన్ & జాన్సన్ కూడా వారి కోవిడ్ 19 వ్యాక్సిన్‌లు ఒమిక్రాన్ విషయంలో ఎంత ప్రభావంతంగా పని చేస్తున్నాయనే విషయంపై పరిశోధనలు జరుపుతున్నాయి. ఫైజర్ వ్యాక్సినేషన్ రెండు డోసులు తీసుకున్నా వారిలో కూడా ఒమిక్రాన్‌కు వ్యతిరేకంగా పోరాడే శక్తి తగ్గుతోంది. దాదాపు 30 రెట్ల తగ్గుదల కనిపించినట్లు పరిశోధకులు వెల్లడించారు.


Also Read : Strange sounds from bathroom: బాత్రూమ్ నుంచి వింత శబ్ధాలు.. టైల్స్ పగలగొట్టి చూస్తే


ఒమిక్రాన్‌ కు వ్యతిరేకంగా పోరాడే సామర్థ్యం.. బూస్టర్ షాట్‌ల ద్వారానే లభిస్తుందంటూ ఆక్స్‌ఫర్డ్ అధ్యయన ఫలితాల ప్రకారం తెలుస్తోంది. ఒమిక్రాన్ ప్రభావం పిల్లలపై ఎలా ఉంటుందనే విషయంపై ఇంకా పరిశోధలు సాగుతున్నాయి. ఇక కోవిడ్19 ప్రస్తుత వ్యాక్సిన్‌లు (COVID-19 vaccines) ఒమిక్రాన్ నుంచి పూర్తిగా రక్షించలేవని నిపుణులు స్పష్టం చేశారు.వ్యాక్సినేషన్ పూర్తయినా కూడా ఒమిక్రాన్ బారినపడే అవకాశాలు ఉన్నట్లు పరిశోధనల్లో తేలింది. 


Also Read : Ravindra Jadeja Retirement: రిటైర్మెంట్​పై క్లారిటీ ఇచ్చిన రవీంద్ర జడేజా!!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook