కరోనా మహమ్మారి చైనాలో విలయతాండవం సృష్టిస్తోంది. రోజూ లక్షలాదిమంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. ఆసుపత్రిలన్నీ కోవిడ్ కేసులతో పోటెత్తుతున్నాయి. ఎక్కడ చూసినా దగ్గు, దమ్ము, శ్వాసకోశ సమస్యలే కన్పిస్తున్నాయి.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

కోవిడ్ 19 పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో పరిస్థితి రోజురోజుకూ ఘోరమౌతోంది. అత్యంత వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 కేసులతో ఆసుపత్రులు నిండిపోయాయి. గత నెలరోజుల్నించి పరిస్థితి పూర్తిగా అదుపు తప్పిపోయింది. లక్షలాది సంఖ్యలో మరణాలు కూడా నమోదవుతున్నాయి. 
ప్రతిరోజూ లక్షలాది కేసులు వెలుగుచూస్తుండటంతో బెడ్స్ సరిపోక ఎక్కడ పడితే అక్కడే చికిత్స చేయించుకుంటున్న దృశ్యాలు వైరల్ అవుతున్నాయి. చైనాలోని ప్రధాన నగరాలు బీజింగ్, షాంఘైల్లో ఇదే పరిస్థితి నెలకొంది. రెండు నగరాల్లోని ఆసుపత్రుల్లో కోవిడ్ రోగుల పరిస్థితి దయనీయంగా మారింది. బెడ్స్ నిండిపోవడంతో కటిక నేలపైనే చికిత్స అందించాల్సిన దుస్థితి ఏర్పడింది. 


మిస్టరీగా 20 మంది సైంటిస్టుల మరణం


చైనాలోని చైనీస్ అకాడమీ ఆఫ్ ఇంజనీరింగ్ సంస్థకు చాలా పేరు ప్రఖ్యాతులున్నాయి. దేశంలో ఈ సంస్థ చాలా ముఖ్యమైంది. దేశానికి చెందిన ప్రముఖ కార్యక్రమాలన్నీ ఇక్కడే అభివృద్ధి చేస్తుంటారు. అలాంటి ఈ సంస్థకు చెందిన 20 మంది విఖ్యాత సైంటిస్టులు కేవలం నెలరోజుల వ్యవధిలో మరణించడం కలకలం రేపుతోంది. ఈ 20 మంది మరణాలు మిస్టరీగా మారాయి. ఒకే నెలలో ఇంతమంది ఎలా మరణించారో అర్ధం కావడం లేదు. 


Also read: 6-Year-Old Boy Shoots : టీచర్ తిట్టిందని గన్ తీసి కాల్చేసిన ఆరేళ్ల బుడతడు!



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     


Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     


Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook