Cricket Australia Donation: భారత్‌కు క్రికెట్ ఆస్ట్రేలియా ఆపన్నహస్తం, 50వేల డాలర్లు కరోనా విరాళం
Cricket Australia Donates 50,000 AUD To India : క్రికెట్ ఆస్ట్రేలియా సైతం భారతదేశానికి అండగా నిలిచింది. తనవంతుగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 50 వేల ఆస్ట్రేలియా డాలర్లు విరాళం ప్రకటించింది. ఆ నగదును యునిసెఫ్ ద్వారా భారత్‌కు అందజేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది.
కరోనా కేసుల నేపథ్యంలో ఆస్ట్రేలియా క్రికెటర్లు ఆడమ్ జంపా తదితర ఆటగాళ్లు స్వదేశానికి పయనమయ్యారు. అదే సమయంలో పాట్ కమిన్స్ లాంటి స్టార్ ఆల్ రౌండర్ భారత్‌పై నమ్మకం ఉంచాడు. తనకు మద్దతుగా నిలిచిన భారత ప్రజలకు కరోనాపై పోరాటంతో తనవంతు మద్దతుగా 50 వేల డాలర్లు సైతం పీఎం కేర్స్ నిధికి ఇటీవల అందించాడు.
తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా సైతం భారతదేశానికి అండగా నిలిచింది. తనవంతుగా ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు 50 వేల ఆస్ట్రేలియా డాలర్లు విరాళం ప్రకటించింది. ఆ నగదును యునిసెఫ్ ద్వారా భారత్‌కు అందజేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. భారత్‌లో ప్రస్తుత పరిస్థితులపై విచారం వ్యక్తం చేసింది. కరోనా సెకండ్ వేవ్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంపై తీవ్ర ప్రభావం చూపిందని, ఈ సమయంలో తమ స్నేహహస్తాన్ని అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు అభిప్రాయపడింది.
ఆస్ట్రేలియా, భారత్ ప్రజల మద్య ప్రత్యేకమైన బంధం ఉంది. రెండు దేశాలు క్రికెట్‌ను ఎంతగానే ప్రేమిస్తాయి. కానీ ప్రస్తుతం కరోనా కష్టకాలంలో భారతదేశంలో సోదరసోదరీమణులు చాలా కష్టాలు ఎదుర్కొంటున్నారు. అందుకే వారికోసం ఆక్సిజన్ కొనుగోలు చేసేందుకు, కోవిడ్19 సంబంధిత ఇతరత్రా అవసరాలకు తమ వంతు సాయం అందించామని పేర్కొన్నారు. యునిసెఫ్ ఆస్ట్రేలియా విభాగం భారత్‌లో ఆక్సిజన్ ఉత్పత్తి చేసే ప్లాంట్ల కోసం, కరోనా బాధితులకు అవసరమైన కిట్లు కొనడానికి వెచ్చించాలని ఆకాంక్షించింది.
Also Read: Ambati Rayudu’s Six: భారీ సిక్సర్‌తో fridge glass door పగలగొట్టిన అంబటి రాయడు
ఇటీవల ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ పాట్ కమిన్స్ భారత్ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు. 50వేల డాలర్లు ప్రకటించి, ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2021)లో ఇతర విదేశీ ఆటగాళ్లలో కదలిక తీసుకొచ్చాడు. కొందరు విదేశీ క్రికెటర్లు కరోనా భయంతో స్వదేశానికి పయనం కాగా, తాను మాత్రం ఐపీఎల్ 2021ను మధ్యలో విడిచి వెళ్లనంటూ ఇతర ఆటగాళ్లలో నమ్మకాన్ని పెంచడం తెలిసిందే. ఆస్ట్రేలియా నుంచి భారత్‌కు మరింత సాయం అందుతుందని కమిన్స్ వ్యాఖ్యానించిన వారానికే క్రికెట్ ఆస్ట్రేలియా తన వంతు విరాళాన్ని ప్రకటించింది.
Also Read: IPL 2021: SRH కెప్టేన్ డేవిడ్ వార్నర్ కాదు.. Kane Williamson
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook