Fuel Price Hike: లీటర్ పెట్రోల్ రూ.450.. షాక్‌లో దేశ ప్రజలు
Petrol Rates in Cuba: క్యూబాలో పెట్రోల్ ఏకంగా 500 శాతం పెరిగాయి. ఆర్థిక సంక్షోభం కారణంగా ధరలను భారీగా పెంచింది క్యూబా దేశ ప్రభుత్వం. ప్రస్తుతం ఆ దేశంలో పెట్రోల్ ధర మన కరెన్సీలో రూ.450కి చేరింది. పూర్తి వివరాలు ఇలా..
Petrol Rates in Cuba: కరీబియన్ దేశం క్యూబాలో తీవ్ర ఆర్థిక సంక్షోభం కారణంగా ధరలు ఆకాశాన్ని అంటాయి. ద్రవ్యలోటును తగ్గించుకునేందుకు ఆ దేశం ఆర్థికంగా కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. ఈ క్రమంలోనే పెట్రోల్ ధరలను ఏకంగా 500 శాతం పెంచింది. దీంతో క్యూబా దేశ ప్రజలు షాక్‌కు గురవుతున్నారు. లీటరు సాధారణ పెట్రోల్ ధర 25 పెసోలు (29 సెంట్లు) నుంచి 132 పెసోలు ($ 1.53), ప్రీమియం ధర 30 నుంచి 156 పెసోలకు పెంచినట్లు ప్రభుత్వం తెలిపింది. అంటే మన కరెన్సీలో లీటరు పెట్రోలు రూ.450 అన్నమాట. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఈ పెంపు అమలు చేస్తున్నట్లు క్యూబా ప్రభుత్వం వెల్లడించింది.
పెట్రోల్ ధరల పెంపుపై క్యూబా ఆర్థిక మంత్రి రెగ్యురో మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో డీజిల్, ఇతర ఇంధన ధరలు కూడా పెరుగుతాయని చెప్పారు. విద్యుత్ ఛార్జీలను కూడా 25 శాతం పెంచుతామన్నారు. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ఆయిల్ కంపెనీలు కొనుగోలు చేసేందుకు విదేశీ కరెన్సీని పెంచుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానికంగా ఉండే ఓ బైకిస్ట్ మాట్లాడుతూ.. పది లీటర్ల పెట్రోల్ కొనుగోలు చేసేందుకు తన నెలవారీ జీతం దాదాపు $21 కంటే ఎక్కువ చెల్లించవలసి ఉంటుందని చెప్పాడు. రోజు పనికి వెళ్లడం, తన కుమార్తెను పాఠశాలనుంచి తీసుకురావడం, తమ సోదరి ఇంటిని సందర్శిస్తుంటానని తెలిపాడు. కాగా.. సగటు క్యూబన్ జీతం నెలకు సుమారు $60కి సమానం.
కరోనావైరస్ మహమ్మారి పరిణామాలు, ఇటీవలి సంవత్సరాలలో యూఎస్ ఆంక్షల కఠినతరం చేయడం.. ఆర్థిక వ్యవస్థలో నిర్మాణాత్మక బలహీనతల కారణంగా 11 మిలియన్ల జనాభా ఉన్న క్యూబా దేశంలో ఆర్థిక సంక్షోభ తలెత్తింది. అధికారిక అంచనాల ప్రకారం.. క్యూబా ఆర్థిక వ్యవస్థ 2023లో రెండు శాతం తగ్గిపోయింది. అయితే 2023లో ద్రవ్యోల్బణం 30 శాతానికి చేరుకుంది. ఇది తక్కువ అంచనా అని నిపుణులు అంటున్నారు. ఇంధన ధరలు, ఇతర ధరలు ఇప్పట్లో అదుపులోకి వచ్చే అవకాశం లేదని చెబుతున్నారు. ఆర్థికవేత్త ఒమర్ మాట్లాడుతూ.. ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే.. క్యూబాలో ఇంధనం ధరలు చౌకగా ఉండొచ్చని.. కానీ దేశంలోని జీతాలతో పోలిస్తే చాలా ఖరీదైనదన్నారు.
Also Read: Sankranthi Special Trains: సంక్రాంతి రద్దీ తట్టుకునేందుకు మరిన్ని ప్రత్యేక రైళ్లు
Also Read: Home Loan Rates: హోమ్ లోన్స్ గుడ్ న్యూస్..వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయ్..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook