France President Emmanuel Macron: భారత రాజ్యంగం 1950 జనవరి 26 న అమల్లోకి వచ్చింది. దీనికి గుర్తుగా ప్రతిఏడాది జనవరి 26 రిపబ్లిక్ డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తుంటాం. న్యూఢిల్లీలోని కర్తవ్యమార్గం (రాజ్ పథ్)లో వేడుకలను నిర్వహిస్తారు. ఈ వేడుకలలో భాగంగా జరిగే పరేడ్ వేడుకలో  ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రాన్ హజరవుతారు. అదే విధంగా రాత్రి న్యూఢిల్లీలోని ప్రెసిడెంట్ భవన్ లో జరిగే ఎట్ హోమ్  కార్యక్రమంలో పాల్గొంటారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


ప్రతి ఏడాది మనదేశంలో జరిగే రిపబ్లిక్ డే వేడుకలకు..  ఇతర దేశాల ప్రెసిడెంట్ లు, దేశాధినేతలను  అతిథులుగా పిలవడం ఆనవాయితీగా వస్తుంది. దీనిలో భాగంగా ఈ సంవత్సరం 75 వ రిపబ్లిక్ డే వేడుకలకు  ఫ్రాన్స్  ప్రెసిడెంట్ ఇమ్మాన్యుయల్ మాక్రాన్ మన దేశానికి రానున్నారు. ఈరోజు ఆయన ప్రత్యేక విమానంలో రాజస్థాన్ లోని జైపూర్ కు చేరుకుంటారు.  రెండు రోజుల  పాటు పలు  ప్రాంతాలను సందర్శిస్తారు. 


Read Also: Republic Day 2024: గణతంత్ర వేడుకలకు సంబంధించిన ఈ ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?


విమానశ్రాయంలో ఆయనను మనదేశ ప్రధాని నరేంద్రమోదీ, ఇతర ముఖ్యనేతలు, అధికారులు ఘనంగా పలకనున్నారు. తన పర్యటలో భాగంగా ఫ్రాన్స్  ప్రెసిడెంట్.. ఈరోజు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన జంతర్ మంతర్ నుంచి సంగనేరి గేట్ వరకు హవామహల్ వద్ద ఆగి ఇద్దరు నేతలు ఉమ్మడి రోడ్‌షోలో పాల్గొంటారు.


అదే విధంగా.. రాజస్థాన్ లోని జైపూర్ కు సందర్శించనున్నారు.  హవా మహల్‌లో జైపూర్‌కి చెందిన ప్రత్యేక మసాలా చాయ్‌ని టెస్ట్ చేస్తారు. అక్కడ ఉన్న  నీలిరంగు కుండలు, ప్రసిద్ధ పొదుగు పని వంటి హస్తకళలతో ఏర్పాటు చేసిన వాటిని సందర్శిస్తారు.  ఆ తర్వాత.. రాంబాగ్ ప్యాలెస్‌లో మిస్టర్ మాక్రాన్ కోసం ప్రైవేట్ డిన్నర్ కూడా ప్లాన్ చేయబడినట్లు సమాచారం. కేంద్రం,  ఫ్రెంచ్ ప్రభుత్వం సైన్యం కోసం ఫ్రెంచ్ ఫైటర్ జెట్‌లు,  జలాంతర్గాముల కోసం బహుళ-బిలియన్ డాలర్ల ఒప్పందాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది. 


Real Aslo: Ayodhya: అయోధ్యలో అరుదైన ఘటన.. రామ్ లల్లా గర్భగుడిలోకి ప్రవేశించిన వానరం ఏంచేసిందో తెలుసా..?


భారతదేశం ప్రతిపాదించిన 26 రాఫెల్ యుద్ధ విమానాలు, మూడు స్కార్పియన్ జలాంతర్గములను కూడా తరువాత జరిగే ద్వైపాక్షిక చర్చలలో పొందుపరచవచ్చని భావిస్తున్నట్లు సమాచారం. భారతదేశానికి, ఫ్రాన్స్ దేశం రెండవ అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా నిలిచింది.  దశాబ్దాలుగా ఐరోపాలో దాని పురాతన, సన్నిహిత స్నేహసంబంధాలను కల్గిఉంది.  


రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత పటిష్టంగా ఉండేందుకు ఈ వేడుకలకు ఆహ్వనించినట్లు తెలుస్తోంది. రిపబ్లిక్ డే వేడుకల కోసం అధ్యక్షుడు మాక్రాన్ చివరి నిమిషంలో ఆహ్వానాన్ని అంగీకరించినట్లు సమాచారం. భారతదేశ గణతంత్ర దినోత్సవానికి ముఖ్య అతిథిగా వచ్చిన ఐదవ ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్. కాగా, గత ఏడాది జూలైలో ఫ్రాన్స్ బాస్టిల్ డే వేడుకలకు ప్రధాని మోదీ అతిథిగా హాజరయ్యారు. 


 



స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 


Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook