Delta Variant: కరోనా మహమ్మారి సంక్రమణ ముప్పు ఇంకా ప్రపంచాన్ని వెంటాడుతూనే ఉంది. ఇండియాలో కల్లోలానికి కారణమైన ఆ వేరియంట్ ఇప్పుడు ప్రపంచాన్ని భయపెడుతోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళనకు కారణమిదే.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ (Corona Second Wave)ఉధృతికి కారణమైన వేరియంట్ డెల్టా వేరియంట్. కరోనా సెకండ్ వేవ్‌లో అత్యధికభాగం కేసులు డెల్టా వేరియంట్ కారణంగానే విజృంభించాయి. ఇప్పుడీ వేరియంట్ ప్రపంచ దేశాల్ని వెంటాడుతోంది. ఈ వేరియంట్ విషయంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేస్తోంది. కరోనా డెల్టా వేరియంట్ అతి వేగంగా వ్యాప్తి చెందుతోందని..క్రమంగా రూపాంతరం కూడా చెందుతూ ప్రమాదకరంగా మారుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనామ్ హెచ్చరించారు.కోవిడ్ 19 మహమ్మారి విషయంలో ప్రపంచం ప్రమాదకర దశను ఎదుర్కొంటోందని చెప్పారు. కరోనా వ్యాక్సినేషన్ మందకొడిగా సాగుతున్న దేశాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని..ఆసుపత్రుల్లో రోగులు నిండిపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.


ఇప్పటికే ప్రపంచంలోని చాలా దేశాల్లో డెల్టా వేరియంట్ (Delta Variant) ఆధిపత్య వేరియంట్‌గా మారుతోందని తేలింది. ప్రజారోగ్య విభాగం వెంటనే స్పందిస్తేనే పరిష్కారం లభిస్తుందన్నారు. ఇప్పటి వరకూ ప్రపంచంలో ఏ దేశం కూడా  కరోనా ముప్పు నుంచి పూర్తిగా బయటపడలేదన్న విషయం గుర్తుంచుకోవల్సి ఉంది. ఇప్పటి వరకూ 98 దేశాల్లో డెల్టా వేరియంట్ వెలుగు చూసింది. ముఖ్యంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ నెమ్మదిగా ఉన్న దేశాల్లోనే డెల్టా వేరియంట్ వ్యాప్తి వేగంగా ఉందని తెలుస్తోంది.  


Also read: UAE Travel Ban: భారత్‌కు ప్రయాణాలు నిషేధిస్తూ పౌరులపై యూఏఈ కఠిన Covid-19 ఆంక్షలు 


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook