America-Joe Bidden: సమస్త హిందూవులకు గణేశ్ చతుర్ధి శుభాకాంక్షలు
అమెరికాలో ఎన్నికల ) America Election campaign ) ప్రచారం ఊపందుకుంటోంది. డెమోక్రటిక్ పార్టీ ( Democratic party ) అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్ భారతీయుల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అందుకే వినాయక చవితి ( vinayaka chavithi ) శుభసందర్భాన్ని ఎంచుకున్నారు.
అమెరికాలో ఎన్నికల ( America Election campaign ) ప్రచారం ఊపందుకుంటోంది. డెమోక్రటిక్ పార్టీ ( Democratic party ) అధ్యక్ష అభ్యర్ధి జో బిడెన్ భారతీయుల్ని ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. అందుకే వినాయక చవితి ( vinayaka chavithi ) శుభసందర్భాన్ని ఎంచుకున్నారు. అమెరికాలోని భారతీయులకు వినాయక చవితి శుభాకాంక్షలు అందిస్తూ ట్వీట్ చేశారు. అమెరికా, ఇండియాలో..మొత్తం ప్రపంచంలో.. హిందూవుల పండుగైన గణేష్ చతుర్ధిని జరుపుకునే వారంతా కష్టాల్నించి గట్టెక్కాలని జో బిడెన్ ఆకాంక్షించారు. భగవంతుడు అందరికీ విజ్ఞానం అందించాలని కోరారు. కొత్తగా జీవితాన్ని ప్రారంభించేందుకు సరైన మార్గాన్ని ఎంచుకోవాలని జో బిడెన్ ( joe bidden ) సూచించారు.
డిసెంబర్ ( December )లో జరగనున్న అమెరికా ఎన్నికల్లో డెమోక్రటిక్ పార్టీ తరపున అధ్యక్ష పదవికి అభ్యర్ధిగా జో బిడెన్ పోటీ చేస్తుండగా..అదే పార్టీ ఉపాధ్యక్ష పదవికి అభ్యర్ధినిగా భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారిస్ ( kamala harris ) పోటీ చేస్తున్నారు. కమలా హ్యారిస్ అభ్యర్ధిత్వంతోనే భారతీయ ఓట్లన్నీ డెమోక్రటిక్ పార్టీవైపు మళ్లుతాయన్నది కొంతమంది విశ్లేషకుల అంచనా.