WHO Director Tedros Adhanom to go into self-quarantine: న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా సాధారణ ప్రజల నుంచి ప్రముఖల వరకు అందరూ కరోనావైరస్ ( Coronavirus ) ప్రభావానికి గురవుతున్నారు. తాజాగా తనను కలిసిన వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ కావడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ (  WHO ) డైర‌క్ట‌ర్ జ‌న‌ర‌ల్ డాక్ట‌ర్ టెడ్రోస్ అధన‌మ్ ఘెబ్రేయేసస్ ( Tedros Adhanom ) సెల్ఫ్ క్వారంటైన్‌లోకి వెళ్లారు. ఈ మేరకు టెడ్రోస్ అధనమ్ సోమవారం ఉదయం ట్విట్ చేసి ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రస్తుతం తాను బాగున్నానని.. డబ్ల్యూహెచ్‌ఓ నిబంధనల ప్రకారం కొన్ని రోజుల పాటు స్వీయ నిర్భంధంలో ఉండి ఇంటి నుంచే పనిచేస్తానని ఆయన వెల్లడించారు. Also read: COVID-19: పరిస్థితి ఇక అప్పటిలా ఉండదు: WHO



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈ మేరకు టెడ్రోస్ అధన‌మ్ ఘెబ్రేయేసస్ ఈ విధంగా ట్విట్ చేశారు. ‘‘నా డబ్ల్యూహెచ్ఓ (World Health Organisation) సహచరుల భాగస్వామ్యంతో వారికి ఏమాత్రం హాని కలిగించకుండా వారి ప్రాణాలకు కాపాడతాను. కష్టమైనప్పటికీ మనమంతా ఆరోగ్య మార్గదర్శకాలను పాటించాలి. ఇలా చేయడం ద్వారా కోవిడ్ 19 సామాజిక వ్యాప్తిని అరికట్టి.. ఆరోగ్య వ్యవస్థలను కాపాడవచ్చు. నేను కోవిడ్ 19 పాజిటివ్ వ్యక్తితో పరిచయం ఏర్పడినట్లు గుర్తించాను. ప్రస్తుతం నేను బాగానే ఉన్నాను. డబ్ల్యూహెచ్ఓ ప్రోటోకాల్స్ ప్రకారం కొన్ని రోజుల పాటు స్వీయ నిర్భంధంలో ఉంటూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాను’’.. అంటూ టెడ్రోస్ అధన‌మ్ ఘెబ్రేయేసస్ ట్విట్ చేశారు. Also read: WHO: కొన్ని దశాబ్దాల పాటు కరోనా కష్టాలు తప్పవు


 


 Also read : SRH Playoffs: సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు అంత ఈజీ కాదు!


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe