ఢిల్లీ అవుట్ స్కర్ట్స్‌లో ప్రారంభమవ్వబోయే మెగా వెంచర్స్‌లో ఫ్లాట్స్ కొనే కస్టమర్స్‌‌కి డొనాల్డ్ ట్రంప్ కొడుకుతో కలిసి డిన్నర్ చేసే అవకాశం కల్పిస్తాం అని ప్రకటనలతో ఊదరగొడుతున్నారు పలు రియల్ ఎస్టేట్ ఏజెంట్లు. ఈ వారంలో డొనాల్డ్ ట్రంప్ కుమారుడు ట్రంప్ జూనియర్ ఓ అనధికార పని మీద ఇండియా వస్తున్నారని.. ఆ తర్వాత ఇండో పసిఫిక్ రిలేషన్స్ పై జరిగే సమావేశంలో ఆయన పాల్గొంటారని సమాచారం. ఈ క్రమంలో భారతదేశంలో ట్రంప్ ఆర్గనైజేషన్ బ్రాండ్ పేరు వాడుకుంటూ.. వెంచర్స్ చేపడుతున్న కొన్ని సంస్థలు పలు ప్రకటనలు చేశాయి.


ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ వ్యాపార సామ్రాజ్యానికి బాధ్యతలు చూస్తున్న ట్రంప్ జూనియర్‌తో ఖరీదైన ఫ్లాట్స్ కొనే తమ కస్టమర్స్‌కు భేటీ అయ్యే అవకాశం కల్పిస్తామని చెబుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా డొనాల్డ్ ట్రంప్ ఆర్గనైజేషన్, భారతదేశంలో వెంచర్స్ చేపడుతున్న కొన్ని సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. తమ బ్రాండ్ పేరు వాడుకుంటూ.. రాయల్టీ చెల్లించే డీల్స్ కూడా చేసుకుంది. 2016లోనే ఈ డీల్స్ ద్వారా ట్రంప్ ఆర్గనైజేషన్ 3 మిలియన్ డాలర్లను సంపాదించిందని సమాచారం. ప్రస్తుతం ట్రంప్ ఆర్గనైజేషన్ పేరుతో వ్యాపారం చేస్తున్న సంస్థల వెంచర్స్ ముంబయి, పుణెతో పాటు గురుగ్రామ్, కోల్‌కతాలలో కూడా కార్యాలయాలు నడుపుతున్నాయి