Trump Vs Kamala: ట్రంప్ వర్సెస్ కమల.. ఎవరైతే మనకు లాభం..?
America Elections: ప్రపంచంలోనే అతి పురాతన ప్రజస్వామ్య దేశమైన అమెరికాలో నేడు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ సారి ఎన్నికల్లో గెలుపు ఎవరినే దానిపై ఉత్కంఠ నెలకొంది. రిపబ్లికన్ పార్టీ తరుపున మాజీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. డెమొక్రాటిక్ పార్టీ తరుపున భారతీయ అమెరికన్ కమల హారిస్ పోటీలో ఉన్నారు.
Trump Vs Kamala: అమెరికా అధ్యక్ష ఎన్నికలు. ఆ దేశానికి 47వ అధ్యక్షుడిని ఎన్నుకుంటున్నారు అమెరికన్లు. ప్రపంచంలోనే అత్యంత సుదీర్ఘంగా జరిగే ఎన్నికలు. అత్యంత ప్రజాస్వామ్య పద్ధతిలో, బ్యాలెట్ బాక్స్ విధానంలో జరిగే ఈ ఎన్నికలపైనే ఇప్పుడు ప్రపంచ దేశాలు దృష్టి సారించాయి. ముందస్తు ఓటింగ్ ఇప్పటికే ప్రారంభమైనప్పటికీ, నవంబర్ 5న (నేడు) ఫైనల్ ఓటింగ్ జరగనుంది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే ఏమవుతుంది... డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి కమలా హ్యారిస్ గెలిస్తే మనకేం లాభం అనేదానిపై విస్తృతమైన చర్చ దేశ విదేశాలతో పాటు మన దేశంలో కూడా జరుగుతోంది. డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే 1892 తర్వాత రెండోసారి గెలిచిన మాజీ అధ్యక్షుడుగా రికార్డు సాధిస్తారు. గతంలో గ్రోవర్ క్లీవ్ ల్యాండ్ ఈ ఘనత సాధించారు. అతను 1884లో అధ్యక్షుడయ్యాడు, 1888లో ఓడిపోయాడు. తిరిగి 1892లో ప్రెసిడెంట్ గా గ్రోవర్ క్లీవ్ ల్యాండ్ గెలిచాడు. అదే.. కమలా హ్యారిస్ గెలిస్తే అగ్రరాజ్యానికి ఎన్నికైన తొలి దక్షిణాసియా, నల్లజాతి భారతీయ అమెరికన్ అధ్యక్షురాలిగా చరిత్ర సృష్టించనుంది.
అమెరికా ఎన్నికల ప్రక్రియ చాలా సంక్లిష్టమైనవి. గందరగోళంగా కూడా అనిపిస్తాయి. ఏ దేశంలో ఇంత సుదీర్ఘంగా ఎన్నికలు జరగవు. దేశాధ్యక్షుడిని నేరుగా ఓటర్లే ఎన్నుకుంటారు. మొత్తం పోలైన ఓట్ల సంఖ్య ఆధారంగా కాకుండా, ఎలక్టోరల్ కాలేజీ ఓట్ల ద్వారా ప్రెసిడెంట్ గెలుపుని నిర్ణయిస్తారు. ప్రస్తుతం డొనాల్డ్ ట్రంప్ స్వల్ప ఆధిక్యంలో ఉన్నారు. ఎన్నికల రోజున ఈ ఆధిక్యాన్ని నిలుపుకుంటే అమెరికాకు తిరిగి ఆయనే మళ్లీ అధ్యక్షుడు అవుతాడు.
ఎన్నికల్లో అమెరికన్లు మూడు విధాలుగా ఓటేస్తారు. ముందస్తుగా వ్యక్తిగతంగా ఓటింగ్ చేస్తారు. కొన్ని రాష్ట్రాల్లో ఇది సెప్టెంబర్ 11న ప్రారంభమైంది. నవంబర్ 5న వ్యక్తి గత ఫైనల్ ఓటింగ్ జరగనుంది. ఆ తర్వాత మెయిల్ ద్వారా ఓటింగ్ ప్రక్రియ ఉంటుంది. తక్కువ జనసాంద్రత, చాలా పెద్ద భూభాగాలు ఉన్న అలస్కా వంటి కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే మెయిల్ ఓటింగ్ మాత్రమే జరుగుతుంది. మొత్తం బ్యాలెట్ ఓట్లు లెక్కించే వరకు తుది ఫలితం వెల్లడించరు. 2020లో, ట్రంప్ ఎన్నికల రాత్రి పెన్సిల్వేనియాలో ముందంజలో ఉన్నారు. అయితే వేలకొద్దీ మెయిల్-ఇన్ బ్యాలెట్లు లెక్కించడానికి నాలుగు రోజులు పట్టింది. చివరకు బైడెన్ ఆధిక్యంలోకి వచ్చారు. యూఎస్ ఎన్నికల్లో ఫలితం ఎలా తారుమారు అవుతుందో చెప్పేందుకు ఈ సంఘటనే ఓ ఉదాహరణ.
ఈ ఎన్నికల్లో అమెరికన్లు ప్రధానంగా ఆర్థిక వ్యవస్థ, ద్రవ్యోల్బణం, ఉద్యోగాలు, జీతాలు, అక్రమ వలసలు, మహిళల హక్కులు, విదేశీ యుద్ధాలు, ప్రపంచంలో అమెరికా ప్రతిష్ఠ అనే అంశాలపై ఎక్కువగా దృష్టి సారించినట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. ఎవరు గెలుస్తారు అనేది ఏడు రాష్ట్రాలు డిసైడ్ చేయనున్నాయని తెలుస్తోంది. ఏడు కీలకమైన స్వింగ్ రాష్ట్రాల్లో డెమొక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య హోరాహోరీ పోరు జరిగే అవకాశాలున్నట్టు పలు సర్వేలు చెబుతున్నాయి. నవంబర్ 2వ తేదీ పోల్ ఫలితాల ప్రకారం ఈ స్వింగ్ స్టేట్స్ లో ట్రంప్ సగటున 48.6 శాతం ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. అదే సమయంలో హ్యారిస్ కు సగటు ఓటింగ్ 47.4శాతం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తంగా అమెరికా ఎన్నికల్లో విజేతను నిర్ణయించే ఈ ఏడు కీలక స్వింగ్ కీలక రాష్ట్రాల్లో ప్రస్తుతం ట్రంప్ కు 1.2శాతం స్వల్ప ఆధిక్యం ఉందంటూ రియల్ క్లియర్ పాలిటిక్స్ సర్వే చెబుతోంది.
ఇదీ చదవండి : Shraddha Kapoor: చిరంజీవికి శ్రద్ధా కపూర్ కు ఉన్న రిలేషన్ తెలుసా.. ఫ్యూజులు ఎగిరిపోవడం పక్కా..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebook సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.