Gang War in Equador Prison: ఈక్వెడార్‌(Ecuador)లోని గ్వాయాక్విల్‌(Guayaquil) నగరంలోని లిటోరల్ జైలులో శనివారం రాత్రి జరిగిన ఘర్షణల్లో 68 మంది ఖైదీలు(Prisoners) మరణించారు. ఈ ఘటనలో 25 మంది ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. ఖైదీల నుంచి పేలుడు పదార్థాలు, తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 900 మంది పోలీసులు ఎనిమిది గంటల పాటు శ్రమించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. మరోవైపు జైలు నుంచి భారీ పేలుడు శబ్దాలు రావడంతో స్థానిక ప్రజలు ఆందోళన చెందారు. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Also Read: Afghanistan: మసీదులో బాంబు పేలుడు.. ముగ్గురి మృతి, 15 మందికిపైగా గాయాలు!


మరోవైపు జైలులో జరిగిన మారణహోమానికి సంబంధించిన కొన్ని వీడియోలు నెట్టింట(Social Media) హాల్ చల్ చేస్తున్నాయి. మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉండడం, కొన్నింటిని కాల్చివేయడం అందులో కనిపిస్తోంది. దీంతో ఖైదీల బంధువులు కారాగారం వద్ద ఆందోళనకు దిగారు. తమవారు ప్రాణాలతో ఉన్నారో.. లేదో.. తెలపాలని జైలు అధికారులను నిలదీశారు. అంతర్జాతీయ మాదకద్రవ్యాల ముఠాకు చెందిన రెండు వర్గాల మధ్య ఈ ఘర్షణలు(Clashes) తలెత్తినట్లు తెలుస్తోంది. గొడవల్లో భాగంగా.. దుండగులు గోడను డైనమైట్‌తో పేల్చేందుకు ప్రయత్నించినట్లు అధికారులు తెలిపారు. జైల్లోకి వెళ్లే సరకుల వాహనాలు, డ్రోన్ల ద్వారా ఆయుధాలు ఖైదీలకు చేరినట్లు భావిస్తున్నారు. రెండు నెలల క్రితం మరో జైల్లోనూ ఇదే తరహాలోనే ఘర్షణలు తలెత్తగా.. 119 మంది ప్రాణాలు కోల్పోయారు.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook