EU's drug regulator approved the use of Pfizer-BioNTech's COVID-19 vaccine: కరోనా కేసులు భారీగా పెరుగతున్న నేపథ్యంలో ఐరోపా సమాఖ్య ఔషధ నియంత్రణ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. 5 నుంచి 11 ఏళ్ల వయస్సున్న పిల్లలకు టీకాలు (vaccine for children) వేసేందుకు సిద్ధమైంది. ఇందులో భాగంగా..ఫార్మా దిగ్గజాలు ఫైజర్​, బయోఎన్​టెక్​లు సంయుక్తంగా అభివృద్ధి చేసిన కొవిడ్ వ్యాక్సిన్​కు (Pfizer, BioNTech vaccine for Kids) అనుమతులు మంజూరు చేసింది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఇటీవలే అగ్రరాజ్యం అమెరికా కూడా పిల్లలకు వ్యాక్సిన్ వేయాలని నిర్ణయించింది. ఇందుకోసం ఫైజర్​, బయోఎన్​టెక్​ల వ్యాక్సిన్​కు అనుమతులు మంజూరు కూడా చేసింది. తాజాగా యురోపియన్ యూనియన్​ కూడా టీకాకు అనుమతులు మంజూరు చేయడంతో.. మరిన్ని దేశాలు ఆ దిశగా అడుగులు వేసే అవకాశముంది.


ఐరోపాలో కరోనా భయాలు ఇలా..


ఐరోపా దేశాల్లో ఇటీవల కరోనా కేసులు విపరీతంగా (Corona cases in EU) పెరుగుతున్నాయి. ముఖ్యంగా జర్మనీలో ఒక్క రోజులోనే 76 వేలకుపైగా కేసులు, 315 మరణాలు సంభవించాయి. ఫ్రాన్స్, పోలాండ్, నెదర్లాండ్స్​, బెల్జియం సహా పలు ఇతర దేశాల్లోను కేసులు ఆందోళనకర స్థాయిలో పెరుగుతున్నాయి.


ఐరోపా సమాఖ్య నుంచి బయటకు వచ్చిన బ్రిటన్​లో కూడా కేసులు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి.


కేసులు భారీగా పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే పలు దేశాలు ఆంక్షలు కఠినతరం చేయడం వంటి నిర్ణయాలు తీసుకుంటున్నాయి.


పిల్లకు ఇచ్చే వ్యాక్సిన్ గురించి..


పిల్లలకోసం అభివృద్ధి చేసిన వ్యాక్సిన్​కు కొమిర్నటి అని పేరు పెట్టినట్లు ఫైజర్​, బయోఎన్​టెక్​లు తెలిపాయి. ఈ వ్యాక్సిన్​ 5-11 ఏళ్ల పిల్లపై జరిపిన క్లీనికల్ ట్రయల్స్​లో 90.7 శాతం సమర్థంగా పని చేసినట్లు తేలిందని పేర్కొన్నాయి.


Also read: పెగసస్ స్పైవేర్ చుట్టూ మరో వివాదం, ఎన్ఎస్ఓ గ్రూప్‌పై యాపిల్ కేసు


Also read: Woman Sues Mom's Doctor : తన త‌ల్లికి డెలివ‌రీ చేసిన డాక్ట‌ర్‌పై కేసు పెట్టిన యువ‌తి


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook