Frozen To Death: కెనడాలో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. ఓ భారతీయ కుటుంబమంతా చలికి గడ్డకట్టి మృతి చెందింది. ఈ విషాద ఘటన కెనడా-అమెరికా సరిహద్దుల్లో చోటు చేసుకుంది. మృతుల్లో ఓ చిన్నారి కూడా ఉండటం మరింత బాధాకరమైన (Indian Falmily dead) విషయం.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అక్రమంగా కెనడా నుంచి అమెరికా వలస వెళ్లేందుకు చేసిన ప్రయత్నం విఫలమవడం వల్లనే వారు మరణించినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు (Illegal immigration) పేర్కొన్నాయి.


ఇంతకీ ఏమైందంటే..


అమెరికా-కెనాడా సరిహద్దు ప్రాంతంలో మానిటోబా రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు (ఆసీఎంపీ) ఇటీవల నాలుగు మృత దేహాలను కనుగొన్నారు. కెనడావైపు ఎమర్సన్​ సమీపంలో (Canada Us Border) వాటిని గుర్తించారు.


అందులో ఇద్దరు పెద్దలు, ఒక టీనేజర్​, ఓ చిన్నారి ఉన్నట్లు తెలిపారు. పోలీసుల విచారణలో వారంతా గుజరాత్​కు చెందిన భారతీయ కుటుంబగా గుర్తించినట్లు వార్తా సంస్థ ఐఏఎన్​ఎస్​ ద్వారా తెలిసింది. ఈ విషయాన్ని కెనడాలోని భారత హైకమిషన్​ కూడా ధృవీకరించింది.


ఇటీవల కెనడా నుంచి అమెరికాకు అక్రమంగా వలస వెళ్లేందుకు ప్రయత్నించిన ఓ గ్రూప్​లో ఈ గుజరాతీ ఫ్యామిలీ కూడా ఉన్నట్లు తెలిసిందని వార్తా సంస్థ వివరించింది. అయితే ఆ ప్రయత్నం విఫలమై.. తీవ్ర మంచు తుఫాను కారణంగా గడ్డకట్టి కుటుంబమంతా ప్రాణాలు కోల్పోయారని పేర్కొంది.


మృతుల పేర్లు జగదీశ్ పటేల్​ (39), అతని భార్య వైశాలి (37), కూతురు విహంగి (11), కొడుకు ధార్మిక్​ (3)గా అధికారులు తెలిపారు.


అంతకు ముందు రోజే కొంత మంది అరెస్టు..


అయితే ఈ ఘటన జరిగిందుకు ముందు రోజు అమెరికా వైపు వెళ్తున్న ఓ వ్యాన్​ను తనిఖీ చేసిన సరిహద్దు పోలీసులు. ఇద్దరు వద్ద సరైన పత్రాలు లేవని గుర్తించారు. దీనితో పాటు వారి వద్ద చిన్నారులకు అవసరమయ్యే వస్తువులు ఉన్నట్లు కనుగొన్నారు. అయితే ఆ వ్యాన్​లో చిన్నారులు ఎవ్వరూ లేకపోవడం పోలీసుల అనుమానాన్ని మరింత పెంచింది. దీనితో పోలీసులు వారితో పాటు వారికి సహకరించిన వ్యక్తిని అరెస్ట్​ చేశారు.


అదే రోజు గుజరాతీ ఫ్యామిలీ విగత జీవులుగా సరిహద్దుల్లో పడి ఉండటం గుర్తించారు. మృత దేహాలన్ని సరిహద్దుకు కేవలం 9-10 మీటర్ల దూరంలో ఉన్నట్లు పోలీసులు (Tragedy in Canada) వెల్లడించారు.


Also read: NeoCov: కరోనా కొత్త వేరియంట్ రూపంలో ముంచుకొస్తున్న ప్రమాదం!


Also read: US First Execution 2022: అమెరికాలో ఈ ఏడాది తొలి మరణ శిక్ష అతనికే...


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook