NeoCov: ఇప్పటికే కరోనా డెల్టా ప్లస్, ఒమిక్రాన్ వేరియంట్లతో ప్రపంచం (Omicron variant) వణికిపోతుంటే.. చైనాలోని వుహాన్ ల్యాబ్ శాస్త్రవేత్తలు మరో భయంకరమైన విషయాన్ని బయటపెట్టారు. 'నియోకోవ్' పేరుతో మరో వేరియంట్ ప్రపంచంపై విరుచుకుపడే ప్రమాదముందని తాజాగా (Corona new variant) హెచ్చరించారు.
నియోకోవ్ వేరియంట్ గురించి..
నియోకోవ్ స్ట్రెయిన్ ప్రస్తుతం దక్షిణాఫ్రికాలో వ్యాప్తి చెందుతోందని (జంతువుల్లో) శాస్త్రవేత్తలు వెల్లడించారు. రష్యా న్యూస్ ఏజెన్సీ స్పుత్నిక్ ప్రకారం.. ఈ వేరియంట్ దక్షిణాఫ్రికాలోని గబ్బిలాలలో తొలుత కనుగొన్నారు. ఈ వేరియంట్ వల్ల మరణాల రేటు అధికంగా (NeoCov Strain With High Death Rate) ఉండనుంది.
ఇది మధ్య ప్రాచ్యంలో వ్యాపించిన రెస్పిరేటరీ సిండ్రోమ్ మెర్స్-కోవ్‌కు సంబంధించినదని శాస్త్రవేత్తలు (NeoCov details) వెల్లడించారు.
ఈ వేరియంట్ 2012, 2015లో వచ్చినట్లుగా.. పూర్తిగా కొత్తది కాదని స్పుత్నిక్ వార్తా సంస్థ పేర్కొంది. అయితే ఈ కొత్త వేరియంట్ అత్యంత వేగంగా వ్యాపిస్తుందని.. ఇది సొకిన ప్రతి ముగ్గురిలో ఒకరు మరణించే ప్రమాదముందని శాస్త్రవేత్తలు చెబుతున్నట్లు (Corona new variant news) వివరిచింది.
అయితే ఈ వేరియంట్ ప్రస్తుతం జంతుల మధ్య మాత్రమే సోకుతుందని.. మనుషులకు ఇంకా సోకలేదని తెలిపారు శాస్త్రవేత్తలు. ఇందులో ఓ మ్యుటేషన్ ద్వారా మనుషులకు కూడా ఈ వేరియంట్ సోకే ప్రమదాముందని మాత్రం (NeoCov news) వెల్లడించారు.
Also read: US First Execution 2022: అమెరికాలో ఈ ఏడాది తొలి మరణ శిక్ష అతనికే...
Also read: Omicron Survival Rate: ఒమిక్రాన్ మనుగడ.. మనిషి చర్మంపై 21 గంటలు, ప్లాస్టిక్‌పై 8 రోజులు..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook