Corona Vaccine for Kids: కరోనా మహమ్మారి కట్టడిలో భాగంగా అమెరికా (Corona impact in USA) ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. చిన్నారుల కోసం ఫార్మా దిగ్గజాలు ఫైజర్-బయోఎన్​టెక్ సంయుక్తంగా (Pfizer kids vaccine)​ అభివృద్ధి చేసిన కొవిడ్ టీకా పంపిణీకి ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆహార, ఔషధ నింత్రణ సంస్థ (ఎఫ్​డీఏ) శుక్రవారం (America FDA) నిర్ణయం తీసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అత్యవసర వినియోగం (Vaccine for Kids) కింద 5 నుంచి 11 ఏళ్ల చిన్నారులకు ఈ టీకా వేయనున్నారు. అయితే దీనిపై నిపుణుల సూచనలను పరిశీలించిన అనంతరం సెంటర్స్ ఫర్ డిజీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్​ వచ్చే వారం తుది ప్రకటన వెలువరించే అవకాశముంది.


చిన్నారులకు ఇచ్చే టీకా వ్యవధి ఇలా..


చిన్నారులకు ఇచ్చే టీకా సంబంధించి విధివిధానాలకు కూడా రూపొందిస్తోంది అమెరికా ఆరోగ్య విభాగం. మూడు వారాల వ్యవధిలోనే రెండు డోసుల టీకా వేయాలని భావిస్తున్నట్లు సమాచారం. అమెరికా వ్యాప్తంగా 5 నుంచి 11 ఏళ్ల వయసున్న పిల్లల సంఖ్య ప్రస్తుతం 2.8 కోట్లుగా ఉన్నట్లు అంచనా.


Also read: Corona Updates: ప్రపంచవ్యాప్తంగా మళ్లీ కొవిడ్ భయాలు- రష్యా, చైనాలో కొత్త కేసుల కలవరం


Also read: Dinosaur in UN General Assembly: ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో డైనోసర్‌ స్పీచ్‌


కరోనా భయాలతో టీకా ప్రక్రియ వేగవంతం..


దాదాపు రెండేళ్లుగా ప్రపంచాన్ని కరోనా మహమ్మారి భయపెడుతునే (World wide Corona fears) ఉంది. వేగంగా కరోనా టీకా అందుబాటులోకి వచ్చినా.. అన్ని వయసుల వారికి ఇది అందుబాటులో లేదు. దీనితో కరోనా కట్టడి కష్టతరమైంది.


ఇదిలా ఉండగా.. టీకా తీసుకున్నా కరోనా విృభిస్తుండటం మరింత ఆందోళన కలిగిస్తున్న విషయం. ముఖ్యంగా ఇటీవలి కాలంలో రష్యా, సింగపూర్​, చైనా సహా వివిధ దేశాల్లో కరోనా కేసులు పెరగటం ఆందోళనలు పెంచింది. రెండు డోసుల టీకా తీసుకున్న వారు కూడా బాధితుల్లో ఉంటడం గమనార్హం.


అయితే అందరికి టీకా ఇస్తేనే కరోనా కట్టడి సాధ్యమని విశ్లేషణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నారుల టీకా అందుబాటులోకి వస్తుండటం మంచి విషయమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్​ సహా వివిధ దేశాల్లో టీకా ప్రక్రియ వేగంగా సాగుతోంది. భారత్ ఇటీవలే 100 కోట్ల టీకా డోసుల పంపిణీ రికార్డును కాడు దక్కించుకుంది.


Also read: Quarantine Room: క్వారంటైన్ గది ఉంటేనే ఆ దేశానికి ఫ్లైట్ టికెట్..లేకపోతే అంతే


Also read: North Korean leader Kim Jong Un: 'ప్రజలారా...2025 వరకు తక్కువ మెుత్తంలో ఆహారం తీసుకోండి'..


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe