Quarantine Room: కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టిన నేపధ్యంలో అంతర్జాతీయ విమాన రాకపోకలు తొలగినా చిక్కులు మాత్రం తప్పడం లేదు. క్వారంటైన్ గది లభిస్తేనే ఫ్లైట్ టికెట్. లేకుంటే అంతే. ఆ వివరాలిలా ఉన్నాయి.
కోవిడ్ 19 నేపధ్యంలో వివిధ దేశాల విధించిన అంతర్జాతీయ ట్రావెల్ నిబంధనలు(International Travel Restrictions)ఇటీవల కాలంలో క్రమంగా తొలగుతున్నాయి. అదే సమయంలో డీజీసీఏ మాత్రం అంతర్జాతీయ విమానాల రాకపోకలపై కొనసాగుతున్న ఆంక్షల్ని మరో నెలరోజుల పాటు పొడిగించింది. ఇప్పటి వరకూ ఉన్న ఆంక్షలు నవంబర్ 30 వరకూ యధాతథంగా ఉంటాయని డీజీసీఏ తెలిపింది. పరస్పర ఒప్పందం మేరకే రెండు వివిధ దేశాల మధ్య అంతర్జాతీయ విమాన రాకపోకలు కొనసాగనున్నాయి.
అదే సమయంలో ఖతార్ (Qatar)ప్రభుత్వ నిబంధనలు వలస కార్మికులకు ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. అక్కడి హోటల్స్‌లో క్వారంటైన్ గది లభిస్తేనే..ప్రయాణానికి అనుమతి లభిస్తుంది. లేకుంటే ఫ్లైట్ టికెట్ దొరకదు. వాస్తవానికి ఖతర్‌కు విమాన సర్వీసులు ఎక్కువగానే ఉన్నా..ఏడు రోజుల క్వారంటైన్‌కు అవసరమైన గదులు లభించడం లేదు. దాంతో ఫ్లైట్ టికెట్ లభించక ప్రయాణాలు వాయిదా పడుతున్నాయి. ఖతార్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం విదేశీయులెవరైనా వారం రోజుల పాటు హోటళ్లలో సెల్ఫ్ క్వారంటైన్లో(Quarantine)ఉండాల్సిందే. 2022లో ప్రపంచ ఫుట్‌బాల్ క్రీడోత్సవాల్ని(International Foot Ball Tournament) ఖతార్ ప్రభుత్వం నిర్వహిస్తోంది. దాంతో ఆ దేశంలో ఉపాధి అవకాశాలు విస్తృతమై..ఎక్కువ వీసాలు జారీ అవుతున్నాయి. మరోవైపు ఖతార్ నుంచి సెలవుపై వచ్చి తిరిగి వెళ్లేవారు తప్పనిసరిగా క్వారంటైన్లో ఉండాల్సి ఉంటుంది. క్వారంటైన్ గది బుక్ చేసుకున్నట్టు చూపిస్తేనే ఫ్లైట్ టికెట్ (No Quarantine room no Flight ticket)జారీ అవుతుంది. ప్రస్తుతం ఆ దేశంలో హోటల్ గదులు నిండిపోవడంతో 20 రోజులకు మించి వెయిటింగ్ నడుస్తోంది.
Also read: Covid19 Vaccination: కరోనా సంక్రమణను ఆపని వ్యాక్సినేషన్, తాజా అధ్యయనం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి