Moderna vaccine: మోడెర్నా వ్యాక్సిన్‌కు ఎఫ్‌డీఏ ఆమోదం ఎప్పుడు..
Moderna vaccine: అమెరికాలో మరో వ్యాక్సిన్ ఆమోదం పొందనుంది. ఫైజర్ వ్యాక్సిన్ తరువాత ఇప్పుడు మోడెర్నా వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి జారీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
Moderna vaccine: అమెరికాలో మరో వ్యాక్సిన్ ఆమోదం పొందనుంది. ఫైజర్ వ్యాక్సిన్ తరువాత ఇప్పుడు మోడెర్నా వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగ అనుమతి జారీ చేసేందుకు రంగం సిద్ధమవుతోంది.
అమెరికా ( America ) లో రెండు ప్రముఖ కంపెనీల వ్యాక్సిన్‌లు సిద్ధమయ్యాయి. అమెరికా ఫార్మా దిగ్గజం ఫైజర్ ( Pfizer ), జర్మనీ సంస్థ బయోన్టెక్ ( Biontech ) అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఇప్పటికే ఆమోదం పొందింది. ఇక ఇప్పుడు మరో అమెరికన్ కంపెనీ మోడెర్నా ( Moderna ) అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ ఆమోదం పొందనుంది. 95 శాతం సమర్ధవంతంగా పనిచేస్తుందని మోడెర్నా కంపెనీ ఇప్పటికే ప్రకటించింది.
మోడెర్నా కంపెనీ వ్యాక్సిన్ Covid19 vaccine )ను 18 ఏళ్లు పైబడిన వారికి ఇవ్వచ్చంటూ నిపుణుల కమిటీ ఎఫ్‌డీఏ ( FDA ) కు సిఫార్సు చేసింది. పైజర్ కంపెనీ కూడా అత్యవసర వినియోగం కోసం విజ్ఞప్తి చేసినప్పుడు ఇదే కమిటీ సిపార్సుపై ఒక్కరోజులోనే అనుమతిచ్చింది ఎఫ్‌డీఏ. మోడెర్నా వ్యాక్సిన్‌కు కూడా ఒకట్రెండు రోజుల్లో అనుమతి రావచ్చని తెలుస్తోంది. అదే జరిగితే అందుబాటులో రానున్న వ్యాక్సిన్‌గా ప్రసిద్ధికెక్కనుంది.
ఫైజర్ వ్యాక్సినేషన్ ( Vaccination ) ఇప్పటికే ప్రారంభమైంది. అమెరికాలోని టెన్నెస్సీ నగరంలోని ఓ ఆసుపత్రిలో వ్యాక్సిన్ తీసుకున్న నర్శు టిఫానీ డోవర్ స్వల్ప అస్వస్థతకు గురై..చికిత్స అనంతరం కోలుకున్నారు. అమెరికా ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలో మోడెర్నా కంపెనీకు విశేషంగా సహాయం చేసిన డోనాల్డ్ ట్రంప్ ( Donald trump ) మాత్రం వ్యాక్సినేషన్ కార్యక్రమంలో కన్పించలేదు. Also read: North Korea: విదేశీ రేడీయో విన్నాడని మత్స్యకారుడు కాల్చివేత