కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు భారత్‌ లాక్‌డౌన్‌ను ప్రవేశపెట్టగా పలు దేశాన్ని దీన్ని అనుసరించాయి. అయితే లాక్‌డౌన్‌ నేపథ్యంలో నిత్యావసర సరుకులు, వస్తువులు మినహా ఇతరత్రా షాపింగ్‌ మాల్స్‌, బార్లు, వైన్స్‌, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు సహా పలు వాటిపై తాత్కాలిక నిషేధం విధించారు. అయితే కొన్ని దేశాల్లో మద్యం దుకాణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మూసివేసే ప్రసక్తే లేదు. ఇందుకు ముఖ్యంగా అయిదు కారణాలు తెలుసుకుందాం.  బ్రేకింగ్: ఏపీలో తాజాగా 81 కరోనా కేసులు


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

మద్యం దుకాణాలు మూసేస్తే ఆస్పత్రులు గజిబిజి
సాధారణంగా కాస్త సేదతీరేందుకు, పని ఒత్తిడిని తగ్గించుకునేందుకు ఆ దేశాల్లో మద్యం సేవిస్తారు. ఒకవేళ అమ్మకాలు నిషేధిస్తే హై బీపీ (అధిక రక్తపోటు), గుండె సంబంధిత సమస్యలు తలెత్తుతాయి. అసహనానికి లోనై ఇళ్లల్లో గొడవలు తలెత్తి ఏదైనా అఘాయిత్యాలకు పాల్పడటం లాంటివి జరుగుతాయి. ఫలితంగా ప్రస్తుతం కరోనా పేషెంట్లతో పాటు ఇలాంటి కేసులకు చికిత్స అందించాలంటే వైద్యులకు పెను సవాలుగా మారుతోంది. Photos: కబాలి బ్యూటీ లేటెస్ట్ ఫొటోలు


ప్రభుత్వాలకు అక్షయపాత్రలుగా మద్యం దుకాణాలు
మద్యం విక్రయించే షాపులు, బార్లు ప్రభుత్వాలకు అక్షయపాత్రలుగా ఉన్నాయి. వాటి అమ్మకాల ద్వారా వచ్చే పన్నులు, ఆదాయం ప్రభుత్వాన్ని నడిపించడంలో కీలకపాత్ర వహిస్తాయి. ఇతర మార్గాల కన్నా ఎక్సైజ్‌ విభాగం నుంచి అధిక రాబడి ప్రభుత్వాన్ని అంత త్వరగా వీటిని నిషేధించే దిశగా ఆలోచన చేయనీయదు. 


మద్యంతో సహా ఆహారం
ఇక్కడ ఎక్కువ శాతం మద్యం షాపులు ఆహారాన్ని విక్రయిస్తుంటాయి. మద్యం కొనుగోలు చేసి వెళుతూ మందుబాబులు తమకు కావలసిన స్నాక్స్‌, ఫుడ్ ఐటమ్స్‌ను కొనుగోలు చేస్తారు. దీంతో వారు వ్యవసాయం, ఆహారం లాంటివి నిత్యావసరాల ఉండటంతో వీటిని అంత ఈజీగా టచ్‌ చేయలేరు.  నటుడికి ఎంత కష్టం.. తల్లి చివరిచూపు దక్కేనా!


సూపర్‌ మార్కెట్లలో స్పెషల్‌ బ్రాండ్‌ లిక్కర్
కొన్ని సూపర్‌ మార్కెట్ తరహా స్టోర్లలో విదేశాల నుంచి తెప్పించిన ప్రత్యేకమైన మద్యం అందుబాటులో ఉంటుంది. రష్యా నుంచి కొన్ని రకాల వోడ్కా, ఇటలీ నుంచి వైన్‌ ఇలా స్పెషల్‌ బ్రాండ్‌ మందును నిత్యావసర సరుకులతో పాటు విక్రయిస్తారు. ఇలా స్పెషల్‌ లిక్కర్‌ విక్రయించేందుకు అధిక పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇవన్నీ ప్రభుత్వానికి ఆర్థిక పరిపుష్టిగా ఉండటం ఓ కారణంగా చెప్పవచ్చు. గరిష్ట ధరలకు బంగారం.. వెండి పరుగులు


నేరాలకు దారితీయడం
వందేళ్ల కిందటి వరకు అక్కడ అవసరమైన సమయంలో ఆల్కహాల్‌ విక్రయాలపై నిషేధం విధించేవారు. తమ ఒత్తిడి తగ్గకపోవడంతో మందుబాబుల నేరాలకు పాల్పడేవారట. మందు దొరకక ఏం చేయాలన్న ఆవేశంతో దాడులు, అసాంఘిక కార్యకలాపాలు జరగడంతో అమెరికాలో మద్యం అమ్మకాల నిలిపివేతకు ప్రభుత్వాలు వెనకడుగు వేస్తున్నాయి. అనర్ధాలే ఎక్కువ అని భావించి మద్యం అమ్మకాల విషయంలో కఠిన నిర్ణయాలు తీసుకోవడం లేదని తెలుస్తోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 


Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!


 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos