న్యూఢిల్లీ: బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. నటుడు ఇర్ఫాన్ తల్లి సయేదా బేగం (95) శనివారం కన్నుమూశారు. గత కొంతకాలం నుంచి వయసురీత్యా అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న సయేదా బేగం తుదిశ్వాస విడిచారని కుటుంబసభ్యులు తెలిపారు. జైపూర్‌లోని బెనివాల్ కాంట కృష్ణ కాలనీలో ఆమె నివాసం ఉంటున్నారు. బ్రేక్‌ఫాస్ట్ ఎక్కువగా తింటే ఎన్ని లాభాలో!
టోంక్‌లోని నవాబ్ కుటుంబానికి చెందిన మహిళ సయేదా మరణంపై సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు. నటుడు ఇర్ఫాన్ ఖాన్‌కు తమ ప్రగాడ సానుభూతి తెలిపారు. మరోవైపు అరుదైన వ్యాధితో పోరాడాడు ఇర్ఫాన్ ఖాన్. న్యూరోఎండోక్రైన్ ట్యూమర్‌కు లండన్‌లో చికిత్స తీసుకున్నాడు. భారత్‌కు తిరిగొచ్చి సినిమా షూటింగ్స్ పూర్తి చేశాడు. పూర్తి స్థాయిలో వ్యాధిని నయం చేసుకోవడానికి మరోసారి లండన్ వెళ్లాడని తెలుస్తోంది. హీరోయిన్ హాట్ ఫొటోలతో ‘హార్ట్ ఎటాక్’!
ప్రస్తుతం ఇర్ఫాన్ విదేశాలలో ఉన్నాడని, తల్లి సయేదా అంత్యక్రియలకు హాజరు కాలేకపోతున్నాడని స్పాట్ బైట్ వెబ్ పేర్కొంది. ప్రస్తుతం లాక్డౌన్ కారణంగా భారత్‌లో దేశీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలపై తాత్కాలిక నిషేధం ఉంది. ఈ నేపథ్యంలో తల్లి కడసారి చూపులకు హాజరయ్యేందుకు ఇర్ఫాన్ యత్నిస్తున్నట్లు సమాచారం. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..