South Africa Parliament fire accident: కేప్ టౌన్‌లోని దక్షిణాఫ్రికా పార్లమెంట్​లో (South African Parliament) భారీ అగ్ని ప్రమాదం (fire accident) చోటుచేసుకుంది. భవనంలోని మూడో అంతస్తు సహా నేషనల్​ అసెంబ్లీ ఛాంబర్​లకు మంటలు వ్యాపించాయి. ఘటనాస్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు వెల్లడించారు. 35 మంది అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే అగ్ని ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.



COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఆందోళన చెందిన కేప్ టౌన్ (Cape Town) నివాసితులు వెంటనే ట్విట్టర్‌లో అగ్ని ప్రమాద చిత్రాలను పంచుకున్నారు. పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు మాజీ కేప్ టౌన్ మేయర్ , ప్రస్తుత మంత్రి ప్యాట్రిసియా డి లిల్లే వెల్లడించారు. గత ఏడాది మార్చి నెలలో పార్లమెంటు పాత అసెంబ్లీ భవనంలో మంటలు చెలరేగాయి. ఈ మంటలకు పై అంతస్తులోని కార్యాలయాలు, కమిటీ గదులతో సహా అనేక ప్రాంతాలు ప్రభావితమయ్యాయి. కేప్ టౌన్‌లోని ఈ పార్లమెంట్ భవన ప్రాంగణంలో మూడు విభాగాలు ఉన్నాయి. ఇందులో అత్యంత పురాతన భవనం 1884లో కట్టారు. అనంతరం 1920, 1980ల్లో మరో రెండింటిని నిర్మించారు. నేషనల్‌ అసెంబ్లీ ఇందులో ఒకటి.  గత ఏడాది ఏప్రిల్‌లోనూ కేప్ టౌన్ విశ్వవిద్యాలయంలోని లైబ్రరీలో అగ్నిప్రమాదం సంభవించి.. ఆఫ్రికన్ చరిత్రకు సంబంధించిన అరుదైన ప్రతులు మంటల్లో కాలి..బూడిదయ్యాయి.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook