దక్షిణ తైవాన్‌లో తీవ్ర విషాదం: భవనంలో చెలరేగిన మంటలు...46 మంది మృతి!
తైవాన్‌లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఈ ప్రమాదంలో 46 మంది అగ్నికి అహుతయ్యారు. మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారు.
Taiwan: తైవాన్‌లో ఘోర అగ్ని ప్రమాదం(Fire Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున సంభవించిన ఈ ప్రమాదంలో 46 మంది సజీవం దహనమైనారు. మరో 79 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 14 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. దీంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
దక్షిణ తైవాన్(southern Taiwan)లో కౌహ్సియుంగ్ (Kaohsiung)నగరంలోని 13 అంతస్తుల టవర్ బ్లాక్‌లో తెల్లవారుజామున 3 గంటలకు మంటలు చెలరేగాయని స్థానిక అగ్నిమాపక శాఖ తెలిపింది. భారీగా ఎగిసిన అగ్నికీలల్లో 46 మంది చిక్కుకొని అక్కడిడక్కడే ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 40 సంవత్సరాల క్రితం నిర్మించిన ఈ భవనంలో కింద షాపింగ్ కాంప్లెక్స్‌లు, పైన అపార్ట్‌మెంట్లు ఉన్నాయి.
Also read: Myanmar: మయన్మార్‌లో ఘోరం.. తిరుగుబాటుదారుల ఘర్షణలో 30 మంది సైనికులు మృతి..!
మంటలను అదుపులోకి తీసుకొచ్చిన రక్షణ, సహాయ దళాలు, బాధితుల కోసం గాలిస్తున్నారు. అగ్నిప్రమాదానికి ముందు పేలుడు శబ్దం వచ్చినట్లు సమీప నివాసితులు స్థానిక మీడియాకు తెలిపారు. భవన శిథిలాల్లో చిక్కుక్కున్న వారిని రక్షించేందుకు ఫైర్ సిబ్బంది(firefighters) నాలుగు గంటలకు పైగా తీవ్రంగా శ్రమించాల్సి వచ్చిందనీ, భవనంలోని కింది అంతస్తుల్లో మంటలు చెలరేగినట్లు ఫైర్ సిబ్బంది వెల్లడించింది. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సిఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook