Food Shortage Crisis: ముదురుతున్న సంక్షోభం- కిలో బియ్యం రూ.500, అరకిలో మిల్క్‌పౌడర్ రూ.800!
Food Shortage Crisis: ఇంధన కొరత, ఆకాశాన్నంటిన ఆహారం, నిత్యవసరాల ధరలు, కరెంటు కోతలు.. ఇది ప్రస్తుతం శ్రీలంక పరిస్థితి. ఆర్థిక సంక్షోభంతో ఆ దేశంలో కిలో బియ్యం ధర రూ.500లకు దాటింది. మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
Food Shortage Crisis: శ్రీలంకలో మునుపెన్నడూ లేని ఆర్థిక సంక్షోభం తాండవం చేస్తోంది. నిత్యవసరాలు, అత్యవసరాలు దొరకక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆహార పదార్థాలు, మిల్క్ పౌడర్, మెడిసిన్, వంట గ్యాస్, ఇంధనం వంటి వాటికి తీవ్రమైన కొరత ఏర్పడింది.
జనం పెట్రోల్, డీజిల్ కోసం బంకుల వద్ద కిలో మీటర్ల మేర క్యూ కడుతున్నారు. ఇక ఇంధన కొరత కారణంగా ఇళ్లకు విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది. వ్యవస్థలోకి కరెన్సీని భారీగా చొప్పించేందుకు ఆ దేశ రిజర్వు బ్యాంక్ ఈ నెల ఆరంభంలో అనుమతినిచ్చిన కారణంగా.. ధరలు.. నిత్యవసరాల ధరలు రికార్డు స్థాయికి పెరిగాయి.
తీవ్రమైన ద్రవ్యోల్బణం వల్ల ఆహార పదార్థాలు, పానియాల ధరలు భారీగా పెరిగాయి. రిటైల్ స్టోర్ల వద్ద కూడా జనాలు గంటలతరబడి వెయిట్ చేయాల్సిన పరిస్థితి తలెత్తింది.
ఆకాశాన్నంటిన ధరలు (శ్రీలంకన్ రూపీలో)..
కిలో బియ్యం ధర రూ.500లకు చేరింది.
400 గ్రాముల మిల్క్ పౌడర్ ధర రూ.790కి చేరింది. కేవలం మూడు రోజుల్లోనే దీని ధర రూ.250 పెరిగింది.
కిలో చక్కెర ధరర రూ.290 వద్దకు చేరింది.
ఆహార కొరత, నిరుద్యోగంతో భారత్‌కు పెరిగిన వలసలు..
శ్రీలంక ఆర్థిక సంక్షోభం రోజు రోజుకు తీవ్రమవుతున్న కారణంగా.. భారత్‌లోని తీర ప్రాంతాలకు వలస వెళ్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు అందులోను తమిళనాడుకు వలస వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. రానున్న రోజుల్లో 2 వేల మంది వరకు శరణార్థులు రావచ్చని అంచనాలు వస్తున్నాయి.
శ్రీలంక సంక్షోభానికి కారణాలు..
శ్రీలంక అధికంగా టూరిజం, వాణిజ్యంపై ఆధారపడుతుంది. కరోనా మహమ్మారి కారణంగా వీటిపై తీవ్ర ప్రభావం పడింది. గత రెండేళ్లలో 14 బిలియన్ డాలర్ల నష్టం వాటిళ్లినట్లు అంచనా. ఇక ఆ దేశ రిజర్వు బ్యాంక్ ప్రకారం 2021 జులై-సెప్టెంబర్ మధ్య శ్రీలంక ఆర్థిక వ్యవస్థ 1.5 శాతం క్షీణించినట్లు తెలిపింపింది.
Also read: Elon Musk Dance Video: టెస్లా మెగా ఈవెంట్ లో డ్యాన్స్ చేసిన ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్
Also read: Pakistan: కుర్చీ దిగాలంటూ పాక్ ఆర్మీ చీఫ్ హెచ్చరిక... ఇమ్రాన్‌కు పదవీ గండం
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook