Imran Khan: జైలులో ఉన్న తప్పని కష్టాలు.. పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ కు మరో 7 ఏళ్ల జైలు శిక్ష.. కారణం ఏంటంటే..?
Pakistan: ఇప్పటికే పాక్ మాజీ ప్రధాని జైలులో శిక్షను అనుభవిస్తున్నారు. దేశం రహస్యాలను లీక్ చేసినందుకు 10 సంవత్సరాలు, అతని భార్యతో పాటు ప్రభుత్వ బహుమతులను అక్రమంగా విక్రయించినందుకు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించబడిన విషయం తెలిసిందే.
Imran Khan 7 Years Jail For Unlawful Marriage: పాక్ మాజీ ప్రధాని పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడిన చందంలా మారింది. ఇప్పటికే ఆయనను దేశం రహస్యాలను లీక్ చేసినందుకు గాను ఆదేశం కోర్టు పదేళ్ల శిక్షను విధించింది. ఇది చాలదన్నట్లు ప్రభుత్వానికి సమకూరిన బహుమతులను అక్రమంగా విక్రయించారు.
దీనితో వచ్చిన సొమ్మును ఆయన పర్సనల్ గా వాడుకున్నారని కూడా అనేక ఆరోపణలు వచ్చాయి. దీంతో విచారణ జరిపిన పోలీసులు ఆయన ఇవన్ని చేసినట్లు కూడా రుజువయ్యాయి. దీంతో ఆయనను మరో 14 సంవత్సరాల జైలు శిక్షను విధించింది. ప్రస్తుతం ఆయన జైలులో శిక్షను అనుభవిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. పుండు మీద కారం చల్లినట్లు ఆయన నిఖానామా కు విరుద్ధంగా పెళ్లి చేసుకున్నారనే ఘటన గతంలో బైటపడింది. దీనిపైకోర్టు ఇమ్రాన్ ను, ఆయన భార్యను బుష్రా బీబీకి పాక్ కోర్టు తాజాగా 7 ఏళ్ల శిక్ష ను విధిస్తు తీర్పు వెలువరించింది. కాగా, బుష్రా బీబీ మొదటి భర్త ఈకేసును పెట్టారు. దీనిపై ట్రయల్ కోర్టు విచారణ జరిపి తాజాగా తీర్పు వెలువరించింది. అయితే.. ముస్లిం చట్టాలు ఇద్దత్ ప్రకారం.. భర్తతో సదరు మహిళ విడాకులు తీసుకున్నా.. లేదా .. భర్త మరణించిన పరిస్థితులలో ఆమె కొంత కాలం గ్యాప్ తీసుకొవాలి.
ఈ రూల్ ను బుష్రా బీబీ అస్సలు పట్టించుకోలేదని ఆమె భర్త ఫరీద్ ఆరోపించారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు ఇమ్రాన్ దంపతులకు ఏడేళ్ల శిక్షను విధిస్తున్నట్లు కూడా తీర్పును వెలువరించింది. అయితే.. ఫరీద్ నుంచి బుష్రా , 2017 లో డైవర్స్ తీసుకుంది. ఆ తర్వాత వెంటనే 2018 జనవరిలో ఇమ్రాన్ తో పెళ్లి జరిగిందని సమాచారం. అయితే.. జనవరిలో జరిగిన వివాహాన్ని మొదట తిరస్కరించిన తరువాత, ఇమ్రాన్ ఖాన్ పార్టీ, పాకిస్తాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (PTI), కొన్ని వారాల తర్వాత మరల దానిని ధృవీకరించాయి.
ప్రస్తుతం.. ఇమ్రాన్ ఖాన్ రావల్పిండి యొక్క గార్రిసన్ సిటీలో జైలులో ఉండగా, అతని భార్య ఇస్లామాబాద్‌లోని హిల్‌టాప్ మాన్షన్‌లో శిక్షను అనుభవిస్తుంది. ఇప్పటికే ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వ పదవిలో ఉండి దుర్వినియోగం చేసినందుకు 10 సంవత్సరాల జైలు శిక్ష ను ఎదుర్కొంటున్నాడు. ప్రస్తుతం కోర్టు విధించిన శిక్షను, మొదట విధించిన శిక్షతో కలిపి అమలు చేస్తారా.. లేదా మరల దీన్ని ప్రత్యేకంగా అమలు చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook