Giuseppe Fiorentino: జీవితంలో మిలియనీర్, బిలియనీర్ అవ్వాలనే కల చాలా మందికి ఉంటుంది. కానీ అతి కొద్దిమందికే అది సాధ్యం అవుతుంది. అందులోనూ యుక్త వయస్సులో ఫుల్ రిచ్ మేన్ అవ్వాలనే కలను నిజం చేసుకోవడం అత్యంత అరుదుగా జరుగుతుంది. ఇప్పుడు మనం చూడబోయే ఓ యువకుడి రియల్ లైఫ్ స్టోరీలో అలాంటి అద్భుతమే జరిగింది. ఈ యువకుడి పేరు జిసిపి ఫ్లోరెంటినో. 26 ఏళ్లకే మిలియనీర్ అనే స్టేటస్ సొంతం చేసుకున్నాడు. మధ్యదరా సముద్రంలో సిసిలి అనే ఓ పెద్ద ద్వీపం ఇతడి స్వస్థలం. ప్రస్తుతం స్విట్లర్లాండ్‌లోని జురిచ్‌లో సెటిల్ అయ్యాడు. లగ్జరీ లైఫ్ కోసం ఏది కావాలనుకున్నా.. అది కొనుక్కునేంత డబ్బు సంపాదించాడు. అందరు ఐశ్వర్యవంతుల్లాగే తను కూడా ఏ లగ్జరీకి లోటు లేకుండా హ్యాపీ లైఫ్ అనుభవిస్తున్నాడు. కానీ జిసిపి ఫ్లోరెంటినోను ఒక్క వెలితి మాత్రం తీవ్రంగా వేధిస్తోంది. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

అదేంటి భారీగా డబ్బు సంపాదించిన జిసిపి ఫ్లోరెంటినోకు ఏదైనా దక్కించుకునేంత డబ్బు ఉన్నప్పుడు ఇంకా వెలితి దేనికి అనే సందేహం రావొచ్చునేమో. అయితే అతడి వెలితిగా ఫీల్ అయ్యేది ఏదో కొనుక్కోలేక కాదు..  తాను భారీగా డబ్బు సంపాదించాను అని ఎగిరి గంతేసి ఇంట్లో చెప్పుకోలేకపోతున్నానే అనే బాధే తనని వెలితిగా ఫీల్ అయ్యేలా చేస్తోంది అంటున్నాడు జిసిపి ఫ్లోరెంటినో. జిసిపి ఫ్లోరెంటినోకి ఆ సమస్య ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలంటే.. అతడి కుటుంబ నేపథ్యం గురించి ముందుగా తెలుసుకోవాలి. 


అదొక సినిమాటిక్ స్టోరీ అంటాడు జిసిపి ఫ్లోరెంటినో. తన తల్లిదండ్రులు ఎప్పుడో ఏళ్ల క్రితమే తమ సొంతూరులో ఆస్తిపాస్తులు అన్నీ వదిలేసి స్విట్జర్లాండ్‌కి వలస వచ్చారు. వాళ్లు ఊరు వదిలి రావడానికి కారణం అక్కడ జరుగుతున్న నేరాలు, ఘోరాలేనట. విపరీతంగా పెరిగిపోతున్న క్రైమ్ రేటు, డబ్బు కోసం ఏమైనా చేసే మాఫియా అరాచకాలను చూసి భయపడిన జిసిపి ఫ్లోరెంటినో తండ్రి.. తన కుటుంబాన్ని తీసుకుని ఊరు వదిలేసి స్విట్జర్లాండ్ వచ్చాడట. అందరి తరహాలో తన కొడుకుపై అక్కడి మాఫియా నీడ కూడా పడొద్దు.. అక్కడి నేరాల్లో తన కొడుకు తల దూర్చొద్దు అనేది జిసిపి ఫ్లోరెంటినో తండ్రి కోరిక. 


ఇదిలావుంటే, ఊహించని విధంగా జిసిపి ఫ్లోరెంటినోకు కాలం కలిసొచ్చింది. తాను చేస్తోన్న వ్యాపారంలో భారీగా లాభాలు వచ్చి భారీగా డబ్బు సంపాదించాడు. కానీ ఆ విషయం ఇంట్లో చెబితే.. కచ్చితంగా తన కొడుకు ఏదో నేరాలు చేసో లేక మాఫియాతో చేతులు కలిపి ఏదో చీకటి పనులు చేసే ఇంత డబ్బు సంపాదించాడు అని తనని అపార్థం చేసుకుంటారనేది జిసిపి ఫ్లోరెంటినో భయమట. అదే కానీ జరిగితే.. తన తల్లిదండ్రులు, కుటుంబం తనని దూరం పెట్టడానికైనా వెనుకాడరని జిసిపి ఫ్లోరెంటినో భయపడుతున్నాడు. 


తను అంత డబ్బు ఎలా సంపాదించాను అని చెబితే అర్థం చేసుకునే పరిస్థితుల్లో తన తల్లిదండ్రులు లేరని.. వాళ్లకు ఏం చెప్పినా తనని అర్థం చేసుకోకపోగా.. తనని మాఫియా కిందే లెక్కగడతారనే భయం జిసిపి ఫ్లోరెంటినోని వెంటాడుతోంది. ప్రస్తుతం నన్ను నన్నుగా ఒక మంచి మనిషి అని ఇష్టపడుతున్నారు. కానీ తాను మిలియనీర్ అని తెలిసిన మరుక్షణం వారు నన్ను అనుమానంతో చూడటం మొదలుపెడతారు అంటున్నారు జిసిపి ఫ్లోరెంటినో. ఏవిధంగా కన్విన్స్ చేసి చెబుదామనుకున్నా.. వాళ్లు మాత్రం తనను మాఫియాతో సంబంధాలు ఉండటం వల్లే ఇంత డబ్బు సంపాదించారనే కోణంతో చూస్తారని.. వాళ్లు తనను ఎక్కడ దూరం పెడతారోననే భయంతోనే ఆ విషయం చెప్పలేకపోతున్నాను అని జిసిపి ఫ్లోరెంటినో చెబుతున్నాడు. 


మరి ఇంతకీ అతడికి ఇంత డబ్బు ఎలా వచ్చిందంటే..
తల్లిదండ్రులకు చెప్పి ఒప్పించలేని పని ఏం చేస్తున్నాడు.. అతడికి ఏం చేస్తే ఇంత డబ్బు వచ్చిందనే సందేహం అతడి గురించి తెలిసిన వాళ్లకు కలుగుతుంది. అయితే, 23 ఏళ్ల ప్రాయంలోనే జిసిపి ఫ్లోరెంటినో సొంతంగా 3సిసి గ్రూప్ ఏజి అనే పేరుతో ఒక బిజినెస్ స్థాపించాడు. ఈ-కామర్స్ లో ట్రైనింగ్ ఇవ్వడమే అతడి బిజినెస్. ప్రస్తుత డిజిటల్ ప్రపంచంలో ఈ కామర్స్ వ్యాపారానిదే పై చేయి కావడంతో ఆ బిజినెస్ అతడికి కలిసొచ్చింది. తన బిజినెస్ పార్టనర్‌తో కలిసి శ్రమించాడు. మూడేళ్లు తిరిగే సరికి 26 ఏళ్ల వయస్సులోనే మిలియనీర్ అయ్యాడు. ఈ మిలియనీర్ గురించి ఫస్ట్‌పోస్ట్ ప్రచురించిన ఇంగ్లీష్ కథనం చదువుతుంటే.. ఇదంతా నిజమేనా అనే సందేహం రాకమానదు. కానీ అతడి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ చూస్తే.. అతడి ఖరీదైన లైఫ్ స్టైల్ చూస్తే.. నిజం అనిపించకమానదు. క్రాస్‌చెక్ చేద్దామని చెక్ చేసి చూస్తే.. 3సిసి గ్రూప్ ఏజి పేరు అతడు బిజినెస్ చేస్తున్నట్టుగా ఓ వెబ్‌సైట్ కూడా దర్శనం ఇచ్చింది. ఏంటో కొన్ని విషయాలు అంతా సినిమాటిక్‌గా అనిపిస్తాయి.. ఎంతకీ నమ్మశక్యంగా ఉండవు కదూ.