భారతీయులకు గుడ్‌న్యూస్, ప్రయాణ ఆంక్షల్ని సడలించిన ఆస్ట్రేలియా
Australia: భారత ప్రయాణీకులకు శుభవార్త. ఆస్ట్రేలియా ప్రయాణీకులపై ఉన్న ఆంక్షల్ని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి కొత్త ఆంక్షలు అమలు కానున్నాయి.
Australia: భారత ప్రయాణీకులకు శుభవార్త. ఆస్ట్రేలియా ప్రయాణీకులపై ఉన్న ఆంక్షల్ని తొలగిస్తున్నట్టు ప్రకటించింది. డిసెంబర్ 1 నుంచి కొత్త ఆంక్షలు అమలు కానున్నాయి.
కరోనా నియంత్రణకై వివిధ దేశాలు ట్రావెల్ ఆంక్షల్ని(Travel Restrictions)అమలు చేస్తున్నాయి. ప్రస్తుతం కరోనా మహమ్మారి సంక్రమణ తగ్గుముఖం పట్టడంతో ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు ఒక్కొక్కటిగా ఆంక్షల్ని సడలిస్తూ వస్తున్నాయి. తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత ప్రయాణీకులకు శుభవార్త విన్పించింది. విదేశీ ప్రయాణీకులపై ఉన్న ఆంక్షల్ని సడలిస్తున్నట్టు ఆస్ట్రేలియా ప్రభుత్వం వెల్లడించింది. ఆస్ట్రేలియా తీసుకున్న ఈ నిర్ణయంతో భారత ఉద్యోగులు, విద్యార్ధులకు ప్రయోజనం కలగనుంది.
డిసెంబర్ 1వ తేదీ నుంచి వ్యాక్సినేషన్ పూర్తయిన వీసా హోల్డర్లు ఆస్ట్రేలియాకు (Australia)రావచ్చని తెలిపింది. దీనికోసం ముందస్తు అనుమతులు అవసరం లేదని స్పష్టం చేసింది. ఆస్ట్రేలియా థెరపెటిక్ గూడ్స్ అడ్మినిస్ట్రేషన్ గుర్తించిన వ్యాక్సిన్లకు పూర్తిగా తీసుకున్నవారికి ప్రయాణ ఆంక్షల్లో మినహాయింపు ఉంటుంది. స్వదేశానికి రావాలనుకున్నవారికి సరైన వీసా ఉండటం తప్పనిసరి. ప్రయాణికులు తమ కరోనా వ్యాక్సినేషన్ సర్టిఫికెట్‌ను సమర్పించాల్సి ఉంటుంది. దీంతో పాటు మూడ్రోజుల వ్యవధిలో చేయించిన కోవిడ్ నెగెటివ్ ధ్రువీకరణ పత్రాన్ని అందించాలి. క్వారంటైన్ రూల్స్ విధిగా పాటించాలి. ఆస్ట్రేలియాకు వచ్చేవారు క్వారంటైన్ నిబంధనలను పాటించాలని అక్కడి ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే జపాన్, దక్షిణ కొరియా పౌరులు క్వారంటైన్(Quarantine)నిబంధనలతో సంబంధం లేకుండా ఆస్ట్రేలియాకు వెళ్లవచ్చు. ఇటీవలే అగ్రరాజ్యం అమెరికా (America)అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలను ఎత్తివేసింది. నవంబర్ 8 నుంచి భారత్ నుంచి రాకపోకలు ప్రారంభమయ్యాయి.
Also read: హిందూ బాలుడి పై పాకిస్తాన్ లో అత్యాచారం.. ఆపై కిరాతకంగా హత్య
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook