గూగుల్ ఎస్.పి.ఎల్.సోరెన్‌సన్ జ్ఞాపకార్థం 2018 మే 29న డూడుల్ తయారుచేసింది. సోరెన్‌సన్ రసాయన శాస్త్రవేత్త. డెన్మార్క్‌కు చెందిన వ్యక్తి.  


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ఈయన పూర్తి పేరు సోరెన్ పెడెన్ లారిట్జ్ సోరెన్‌సన్. 9 జనవరి 1868 డెన్మార్క్‌లోని హావ్రెబ్‌జెర్గ్ లో జన్మించారు. ఈయన తొలిసారి రసాయన శాస్త్రంలో pH స్కేలును పరిచయం చేసారు. ఈ స్కేలు వల్ల ఆమ్ల, క్షార బలాలను తెలుసుకోవచ్చు.


1901 నుండి 1938 వరకు అతను కోపెన్‌హగ్‌లోని కార్ల్స్‌బర్గ్ లేబొరేటరీలో ఆధిపతిగా ఉండేవారు. కార్ల్స్‌బర్గ్ లేబొరేటరీలో పరిశోధనలు చేస్తున్నపుడు ఆయన ప్రోటీన్లపై అయాన్ గాఢత ప్రభావాన్ని అధ్యయనం చేసారు. హైడ్రోజన్ అయాన్ గాఢత చాలా ముఖ్యమని గుర్తించారు. 1990లో సులువు పద్ధతిలో pH-స్కేలును వివరించారు.


ఆయన ప్రవేశపెట్టిన pH-స్కేలు ఆమ్లత్వాన్ని గణన చేయుటకు రెండు రకాల పద్ధతులను వివరించింది. మొదటి పద్దతి ఎలక్ట్రోడ్‌ల ఆధారంగా, రెండవ పద్దతిలో కొన్ని సూచికలనుపయోగించి పదార్థం మారే రంగుల నమూనాల ఆధారంగా ఆమ్ల, క్షార బలాలను వివరించింది. సోరెన్‌సన్ 71వ ఏటా 12 ఫిబ్రవరి 1939లో డెన్మార్క్‌లోని కోపెన్‌హగ్‌లో కన్నుమూశారు.  


pH స్కేలు గురించి..


హైడ్రోజన్ అయాన్ గాఢతను లెక్కించడానికి వాడే స్కేలును pH స్కేలు అంటారు.


pH = -log [ H+ ]


pH విలువను pH స్కేలుపై ఉండే 0 నుండి 14 వరకు ఉండే విలువల ద్వారా కొలుస్తారు.


ఎలక్ట్రోడ్‌ల ఆధారంగా- ఆమ్ల ద్రావణం యొక్క pH విలువ 7 కంటే తక్కువగాను, క్షార ద్రావణం యొక్క pH విలువ 7 కంటే ఎక్కువగాను, తటస్థ ద్రావణంకు 7గాను ఉంటుంది. ద్రావణంలో H+ అయాన్ల గాఢత పెరిగితే pH విలువ తగ్గుతుంది. pH విలువ 7 నుండి 14 వరకు పెరిగితే అది ద్రావణంలో OH – అయాన్ల గాఢత పెరుగుదలను తెలియజేస్తుంది.


ఉదా: గ్యాస్ట్రిక్ రసం pH విలువ 1-2, నిమ్మరసం, టమాటో 2 - 4, ఉమ్మి 6.4 - 6.9, మూత్రం 4.8 - 7.5, స్వచ్చమైన నీరు 7, రక్తం 7.32- 7.45, NaCl 7, గుడ్డు 8  
 


రంగుల నమూనాల ఆధారంగా- వివిధ పదార్థాల యొక్క ఆమ్ల, క్షార స్వభావాన్ని వివిధ ఆమ్ల, క్షార సూచికలు ద్వారా తెల్సుసుకోవచ్చు. ఆమ్ల లేదా క్షార ద్రావణంలో సూచికలు సూచించు రంగుల మార్పు ఆధారంగా అవి ఆమ్ల లేదా క్షార స్వభావమును కలిగి ఉన్నాయో తెలుసుకోవచ్చు.


సూచిక ఆమ్ల ద్రావణం క్షార ద్రావణం
మిథైల్ ఆరెంజ్ ఆరెంజ్ ఎరుపు పసుపు
ఫినాప్తలిన్ రంగు ఉండదు గులాబి
మిథైల్ రెడ్ ఎరుపు పసుపు
ఫినాల్ రెడ్ పసుపు ఎరుపు