Google Pay users can send money from US to India: ఎప్పటికప్పుడు కొత్త ఆవిష్కరణలతో స్మార్ట్‌ఫోన్ యూజర్స్‌కి మరింత చేరువవుతున్న గూగుల్ పే యాప్ తాజాగా అమెరికాలోని యూజర్స్ కోసం ఓ స‌రికొత్త సౌక‌ర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. గూగుల్ పే యాప్‌ యూజర్స్ ఇకపై అమెరికా నుంచి భార‌త్‌, సింగ‌పూర్‌‌లలో ఉన్న ఇతర గూగుల్ యూజ‌ర్ల‌కు ఇబ్బందులు లేకుండా ఈజీగా మనీ ట్రాన్స్‌ఫర్ (Money transfer) చేసే సౌకర్యాన్ని అందించింది. గూగుల్ పే యాప్ యూజర్స్‌కి ఈ సౌకర్యం అందించడం కోసం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో మనీ ట్రాన్స్‌ఫర్ సేవలు అందిస్తున్న వెస్ట్ర‌న్ యూనియ‌న్, వైజ్ కంపెనీల‌తో గూగుల్ పే ఒప్పందం చేసుకుంది.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

వెస్ట్ర‌న్ యూనియ‌న్‌తో మనీ ట్రాన్స్‌ఫర్ ఒప్పందం కారణంగా ఇక‌పై అమెరికాలోని గూగుల్ పే యూజ‌ర్లు మ‌రో 200 దేశాల‌కు, వైజ్ ద్వారా 80 దేశాల‌కు డ‌బ్బు పంపే అవకాశం ఏర్పడిందని గూగుల్ పే ఓ ప్రకటనలో పేర్కొంది. గూగుల్ పే యూజర్స్ చేయాల్సిందల్లా వెస్ట్రన్ యూనియన్ లేదా వైజ్.. ఈ రెండింట్లో ఏ సర్వీసు ద్వారా డబ్బులు పంపించాలో ఆ ఆప్షన్ ను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఆప్షన్ ఎంపిక చేసుకున్న త‌ర్వాత ట్రాన్స్‌ఫర్ చేయాలనుకున్న మొత్తాన్ని ఎంటర్ చేసి గూగుల్ పే యాప్ అడిగిన వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే గూగుల్ పే యూజర్స్ (Google pay users) అవతలి వారికి మనీ పంపించినట్టే. 


Also read : EPFO: ఈపీఎఫ్ నగదును ఖాతాదారులు పాత అకౌంట్ నుంచి ఇలా Transfer చేసుకోవచ్చు


గూగుల్ పే ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ (Money transfer) జరిగిందా లేదా అనే వివరాలు తెలుసుకునేందుకు వీలుగా ట్రాన్సాక్షన్ ఐడీతో కూడిన ఈ రిసీప్ట్ వస్తుంది. ఆ రిఫరెన్స్ నెంబర్ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్ అయిందో లేదో ట్రాక్ చేసే అవకాశం కూడా ఉంటుంది. గూగుల్‌ పే నుంచి వెస్ట్రన్‌ యూనియన్‌ (Western union) ద్వారా మనీ ట్రాన్స్ ఫర్ చేసినట్టయితే అదనంగా ఎలాంటి చార్జీలు వర్తించవు. ఒకవేళ వైజ్‌ ఆప్షన్ ఎంచుకున్నట్టయితే.. ఫారిన్‌ ఎక్చేంజ్ రేటు, ట్రాన్స్‌ఫర్‌ ఫీజు వర్తిస్తాయని గూగుల్ పే (Google pay app) వెల్లడించింది.


స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G


Apple Link - https://apple.co/3loQYe 


మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook